ఏపీ ప్రజలు జగన్ పాలన మెచ్చి వైసీపీకి మద్ధతుగా ఉంటున్నారో...లేక పథకాలు పోకూడదని వైసీపీకి మద్ధతుగా ఉంటున్నారో తెలియదు గానీ...ప్రతి ఎన్నికలోనూ ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పడుతూ వచ్చారు. మొదట జరిగిన పంచాయితీ ఎన్నికల్లో వైసీపీకి అదిరిపోయే విజయాన్ని అందించారు. రాష్ట్రంలో దాదాపు 80 శాతం పంచాయితీలని వైసీపీనే కైవసం చేసుకుంది.

ఇక తర్వాత జరిగిన మున్సిపాలిటీల్లో 99 శాతం విజయాన్ని దక్కించుకోగా, కార్పొరేషన్ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసింది. మధ్యలో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచింది. తాజాగా వెలువడిన ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌సి‌టి ఎన్నికల ఫలితాల్లో దుమ్ములేపింది. దాదాపు 98 శాతం జెడ్‌పి‌టి‌సి స్థానాలని వైసీపీ దక్కించుకుంది. అలాగే 86 శాతం ఎం‌పి‌టి‌సి స్థానాలని కైవసం చేసుకుంది. అంటే వైసీపీని ప్రజలు ఎంతలా ఆదరిస్తున్నారో అర్ధమవుతుంది. అసలు ఏ మాత్రం ప్రతిపక్షాల వైపు ప్రజలు వెళ్ళడం లేదు.

ఈ విజయాలని బట్టి చూస్తే నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి భారీగా సీట్లు ఇవ్వడం ఖాయమని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి భారీగా 151 సీట్లు ఇచ్చారు. టి‌డి‌పికి కేవలం 23, జనసేనకు ఒక సీటు ఇచ్చారు. అయితే స్థానిక పోరులో వైసీపీకి వన్‌సైడ్‌గా విజయం దక్కేలా చేశారు. అంటే నెక్స్ట్ 151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని భావిస్తున్నారు. ఆఖరికి టి‌డి‌పి సిట్టింగ్ సీట్లలో కూడా వైసీపీ ఆధిక్యం కొనసాగింది.


అటు కుప్పం, హిందూపురం లాంటి నియోజకవర్గాల్లో సూపర్ విక్టరీ అందుకుంది. అంటే నెక్స్ట్ 151 పైనే సీట్లు రావడం ఖాయమని మాట్లాడుకుంటున్నారు. ఇదే పరిస్తితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 170 సీట్లు వరకు వస్తాయని చర్చలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ప్రజలు మైండ్...నెక్స్ట్ ఎన్నికలకు ప్రజల మైండ్ మారిపోయే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. ఎందుకంటే స్థానిక ఎన్నికలు వేరు...సాధారణ ఎన్నికలు వేరు. మరి చూడాలి నెక్స్ట్ పరిస్తితి ఎలా ఉంటుందో?  

మరింత సమాచారం తెలుసుకోండి: