ఇన్ని సీట్లు గెలుచుకున్న జగన్ .. ఇన్ని స్వీట్లు తిన్న జగన్.. ఎందుకని ఓ ఆడబిడ్డ రక్షణపై పట్టు పెంచుకోలేకపోతున్నారు. ఎం దుకని కాకినాడ మేయర్ ఛైర్ టీడీపీ నుంచి కొట్టేయాలని చూస్తున్నారు. అలా చేస్తే ఏమయినా మంచి జరుగుతుందా? తెరవెనుక మంత్రాంగం ఎలా ఉంది? అవిశ్వాసంపై వైసీపీ సాధించేదేంటి? కాకినాడ రాజకీయంలో నెగ్గేది ఎవరు? కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ వ్యూహం ఫలిస్తుందా?


జగన్ పార్టీ మనుషులకే కాదు పార్టీకి చెందని మనుషులకూ  ప్రాణ రక్షణ ఇవ్వాలి ప్రభుత్వం. ఓ ప్రథమ పౌరురాలు తనకు ప్రాణ భయం ఉందంటే పోలీసులు స్పందించినా ఆ స్పందన పూర్తి స్థాయిలో లేదని అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ఆమె ఉన్నతాధికారుల కు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ, సీఐ స్థాయి అధికారి రంగంలోకి దిగినా ఫలితం మాత్రం అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఆమె ఎప్పటి నుంచో కార్పొరేటర్ల నుంచి అవమానాలు ఎదుర్కొంటున్నారు. అలాంటప్పుడు పదవి నుంచి ఆమెను తప్పించేందుకు ఏమయినా చేస్తారన్న భయం ఆమెలో ఎందుకు ఉండదు. భయాలనో, ఆందోళనలనో తొలగించి ధైర్యం నింపాల్సింది ఎవరు? పోలీసులే కదా! మరి వారేం చేస్తున్నారు.



టీడీపీ మేయర్ ఆమె. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్నికయిన మేయర్ ఆమె. పేరు సుంకర పావని. ఆమెను కొందరు చం పేస్తామని బెదిరిస్తున్నారు. ఆమె ఇంటి ముందే కొందరు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. అంతేకాదు ఆమె ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లో నిఘా నిమిత్తం కెమెరాలు పెట్టారు. ఇదే కాదు ఇంకొందరు నిరంతరం ఆమెను వేధిస్తున్నారు. ఇలా ఎన్నో ఇబ్బందుల నడుమ ఆమె నెట్టుకు వస్తున్నారు. పేరుకే ప్రజాప్రతినిధిని అని తన మాట ఎక్కడా చెల్లడం లేదని కన్నీరుమున్నీ రవుతున్నారు. మరోవైపు వైసీపీతో పాటు టీడీపీలో ఉన్న కొందరు కార్పొరేటర్లు కూడా ఆమెకు సహకరించడంలో లేదు అని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఆమెకు పదవి దక్కిన రోజు నుంచి ఇప్పటిదాకా కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారని ఆ కథనాలు వెల్లడి చేస్తున్నాయి. మరోవైపు ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన అసంతృప్తవాదులు తమ పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నా రు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap