భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ  భార‌త దేశంలో గ‌తంలో ఉన్న ప్ర‌ధానుల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నాడు. దూకుడుగా ముందుకు వెళ్తున్నాడు. చ‌ర్చ‌నీయాంశ నిర్ణ‌యాలు తీసుకుంటూ.. ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించుకుంటున్నాడు. డ్రెస్సింగ్ స్టైల్ నుంచి గ‌డ్డం వ‌ర‌కు ప్ర‌తిదీ వెరైటీ గా ఉంటుంది.  అలాగే పార్టీ, పార్టీలోని కార్య‌క‌ర్త‌ల‌కు క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలోనూ క‌ఠినంగా ఉంటారు. ఈ క్ర‌మంలో త‌న సొంత పార్టీ నేత‌ల‌కే న‌రేంద్ర మోడీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఆ విష‌యమై ఢిల్లీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. 


 అదేంటి అంటే.. త్వ‌ర‌లో ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో రాబోయే ఏడాదిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అక్కడ కున్న పార్ల‌మెంట్ స‌భ్యుల‌ను వాళ్ల నియోజ‌క వ‌ర్గంలో చేసిన ప‌నులు, సాధించిన ప్ర‌గతిని గురించిన నివేదిక‌ను సమ‌ర్పించాల‌ని ఆదేశించారు.  2014 లో అధికారంలోకి వ‌చ్చిన బీజేపీకి ఆ రాష్ట్రంలో 73 మంది గెలిచారు. మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల్లో 63- 64 ఎంపీ స్థానాల‌ను గెలుచుకున్నారు.


వాళ్లంద‌రిని కూడా వాళ్ల వాళ్ల ప‌రిధిలో ఉన్న నియోజ‌వ‌ర్గాల్లో వాళ్లు చేసిన అభివృద్ధిని ఎంపీలు, అలాగే అక్క‌డ ఉన్న ఎమ్మెల్యేల‌తో క‌లిసి మోడీ స‌మీక్షిస్తున్నార‌ని పార్టీలో చ‌ర్చ జ‌ర‌గుతోంది. దీనికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వ‌ర్యంలో  స‌మీక్ష చేస్తున్నారు. దాన్ని బ‌ట్టి  అక్కడ ఎలాంటి స‌మీక‌ర‌ణాలు చేయాల‌న్న‌ది వ్యూహాలు ర‌చిస్తార‌నేది స‌మాచారం. ఈ క్ర‌మంలో అక‌స్మాత్తు ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యానికి వ‌చ్చారు ప్ర‌ధాని మోడీ. వ‌చ్చిన త‌రువాత త‌న చేతులో ఉన్న ఫైల్‌ను  టేబుల్ పై పెట్టారు.


   స‌మీక్ష‌కు న‌న్నెందుకు పిల‌వ‌లేదు. నేను కూడా ఈ రాష్ట్ర ఎంపీనే క‌దా అంటూ ప్ర‌శ్నించారు. దీంతో ఒక్క‌సారిగా పార్టీ కార్యాల‌యంలో ఉన్న నేత‌లు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు.  త‌రువాత ఇదిగో నేను చేసిన ప‌నుల‌కు సంబంధించిన వివ‌రాలు ఇందులో ఉన్నాయ‌ని చెప్పారు. నేను కూడా వార‌ణాసి ఎంపీనే  క‌దా నన్ను కూడా పిల‌వాలి క‌దా అని చెప్పి.. ఫైల్‌ను ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షునికి అప్ప‌గించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: