దేవుడి పాల‌న‌లో మాన‌వ మృగాలు అడ్డూ అదుపూ లేకుండా చేస్తోన్న స్వేచ్ఛా విహారంను మ‌నం ఆప‌లేం. కేవ‌లం చూస్తూ విం టూ క‌న్నీరెడుతూ ప‌క్క‌కు త‌ప్పుకుపోవ‌డ‌ మే..ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం.



జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో నేర నియంత్ర‌ణ‌పై ఎన్ని అనుమానాలు ఉన్నాయో అన్న‌ది ఎప్ప‌టిక‌ప్పుడు రుజువు అవుతూనే ఉంది. నింది తులు అధికార పార్టీ స‌భ్యులే అయితే ఏం చేయాలి.. ఇంకావేగంగా చ‌ర్య‌లుంటాయి అని అనుకుంటాం కానీ ఆ విధంగా జ‌ర‌గ‌డం లే దు. ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చిందో చంపేస్తాం అన్న ప‌దం త‌ప్ప, ఇంకా ఏం ప‌దం  బాధితుల‌ను ఉద్దేశించి వారు వాడ‌రు? త‌న కు జ‌రిగిన అన్యాయంపై ఇప్పుడు ఆ బాధితురాలి గొంతు విప్ప‌లేదు. ఎందుకంటే ఆమె మూగ.. వీళ్లా ఏంచేస్తారో కూడా అర్థం కా వ‌డం లేదు. శిక్షించాల్సింది కోర్టులోనా? స‌మాజంలోనా?




విశాఖ జిల్లా సీలేరు నిన్న వార్త‌ల్లోకి వ‌చ్చింది. నిందితుడు మాత్రం హాయిగానే ఉన్నాడ‌ని స‌మాచారం. ఆయ‌న‌పై క‌ట్టిన కేసులు అంత బ‌ల‌మైన‌వో కావో అన్న‌ది న్యాయ నిపుణులే తేల్చాలి. మ‌రి! దిశ చ‌ట్టం ప్ర‌కారం ఏం చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది ఇవి క‌దా ప్ర‌భుత్వం చెప్పాలి.  మ‌నం గొంతు చించుకుంటూ పోతున్నామే కానీ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు తెలియ‌దా చెప్పండి. చ‌ట్ట రూపంలో లేనిది చ‌ట్టం ఎలా అవుతుంది అని? ఏదేమైనప్ప‌టికీ సీలేరు నిందితుడ్ని  వైసీపీ స‌ర్కారు ఏ విధంగా శిక్షిస్తుంది అన్న‌దే ఆస‌క్తిదాయ‌కం.


దిశ చ‌ట్టంతో అంతా మంచే జ‌రుగుతుంద‌ని హోం మినిస్ట‌ర్ చెబుతున్నారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త, ర‌క్ష‌ణ‌, వారికి ఆర్థిక భ‌రోసా ద‌క్కించ‌డం లో తాము ముందున్నామ‌ని సీఎం జ‌గ‌న్ స‌ర్ చెబుతున్నారు. వీరి మాట‌లు ఎలా ఉన్నా జ‌ర‌గాల్సిన దారుణాలు జ‌రిగిపోతూనే ఉన్నాయి. వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ త‌గ్గిన దాఖ‌లాలే లేవు. నేరాల నియంత్ర‌ణ‌లో అత్యంత విఫ‌లం చెందిన రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశేన‌ని కేంద్రం కూడా తాను ప‌రిశీలించి రూపొందించిన జాబితాలో తేల్చింది. గ‌ణాంకాల తీరు ఎలా ఉన్నా వాటి వెనుక ఉన్న తీవ్ర‌త‌లు ఎలా ఉన్నా  జ‌రిగే ఘోరం ఆప‌డం పోలీసుల త‌రం కావ‌డం లేదు. అభం శుభం తెలియ‌ని చిన్నారులే కాదు క‌నీసం తమ పేరు కూడా ప‌ల‌క‌డం తెలియ‌ని దివ్యాంగురాల‌ని సైతం  వ‌దల‌ని మాన‌వ మృగాలు ఎన్నో మ‌న మ‌ధ్యే ఉన్నాయి. అయినా కూడా వాటికి ఏ భ‌యం లేదు. తాజాగా విశాఖ జిల్లా, సీలేరులో జ‌రిగిన ఘ‌ట‌నలో వైసీపీ నేత నిందితుడు అని తేలింది. అత‌ని పేరు నాళ్ల వెంక‌ట‌రావు. ఇప్ప‌టికే నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఏం చేస్తారు?

మరింత సమాచారం తెలుసుకోండి: