జ‌గ‌న్ ఎవ్వ‌రినీ లెక్క‌చేయ‌డు. ఎవ్వ‌రినీ క‌లుపుకోడు..ఇవీ ఆయ‌న‌పై ఉన్న ఆరోప‌ణ‌లు. ఇవి ఎలా ఉన్నా కూడా ఆయ‌న త‌న ప‌ని తాను చేసుకుని పోతున్నారు. మ‌రి! రాజ‌శేఖ‌ర్ రెడ్డి అంత‌టి స‌మ‌ర్థుడా అంటే కానే కాదు అని ఎన్న‌డో తేలిపోయింది.ఈ నేప‌థ్యంలో క‌రోనా అనే ఒకే ఒక్క సాకుతో ఆయ‌న ఒడ్డెక్కిపోతే ఒడ్డెక్కిపోవ‌చ్చు కానీ ఇలా ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌ను కేవ‌లం సంక్షేమానికే వెచ్చించడం అన్న‌ది త‌గ‌ని ప‌ని అని అంటున్నారు ఉండ‌వ‌ల్లి.. అనే వైఎస్ భ‌క్తుడు.

 


వ‌స్తున్న డ‌బ్బుకు, పెడుతున్న ఖ‌ర్చుకు పొంత‌న లేని ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో మ‌నం ఉన్నాం. అయితే క‌రోనా సాకుతో ఆయ‌నేం అయినా చేయ‌నీయండి కాద‌నం. కానీ రేప‌టి వేళ ఈ అప్పుల‌న్న‌వి  త‌ప్ప‌క ప్ర‌మాద‌కారి కావొచ్చు. మిగ‌తా రాష్ట్రాలు సంప‌ద సృష్టిపైనే దృష్టి పెడుతున్నాయి. జ‌గ‌న్ మాత్రం తెలిసో తెలియ‌కో మొత్తం డ‌బ్బులు న‌వ ర‌త్నాల పేరిట ఖ‌ర్చు పెడుతున్నాడు. దీని వ‌ల్ల ఆర్థికంగా రాష్ట్ర పురోగ‌తి సాధించ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని. ఉమ్మ‌డి రాష్ట్రంలోనే లేని ఓవ‌ర్ డ్రాఫ్ట్ ఇప్పుడెందుకు.. ఎస్క్రో ఎకౌంట్ ఎందుకు?రాబోయే ఆదాయాల‌ను ఆస‌రాగా చేసుకుని, దాన్నొక  హామీగా ఉంచి అప్పులు తేవ‌డంలో ఎంత‌టి అవ‌మానం ఉందో వీరెవ్వ‌రికైనా అర్థం అవుతుందా?


- ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్, మాజీ ఎంపీ (వైఎస్సార్ భ‌క్తుడు)




దేవుడి పాల‌న త‌న‌ది అంటాడు జ‌గ‌న్. వైఎస్ నా దేవుడు అంటున్నాడు ఉండ‌వ‌ల్లి. మ‌రి! దేవుడి పాల‌న వైఎస్ భ‌క్తుడికి న‌చ్చ లేదా అంటే ఔన‌న్న స‌మాధానమే ఆయ‌న నుంచి వినిపిస్తుంది. అంతేకాదు ఆయ‌న ప‌దే ప‌దే ఈ మాట మీడియా ఎదుట చెబుతున్నా డు. జ‌గ‌న్ మంచి వ్యాపార వేత్త. కానీ రాష్ట్రాన్ని న‌డ‌ప‌డంలో ఎన్నో వైఫ‌ల్యాలు చ‌వి చూస్తున్నాడ‌ని అంటున్నాడు ఉండ‌వ‌ల్లి. త‌న‌ను క‌లిసిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు జాఫ‌ర్ కు కొన్ని విష‌యాలు చెప్పాడు. త‌నను అడిగిన ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు జవాబులు దాటవేశాడు. ము ఖ్యంగా జ‌గ‌న్ క్యాపిట‌ల్ ఇన్వెస్టిమెంట్ అన్న‌ది పెట్ట‌డం లేద‌ని, అప్పులు తెచ్చి సంక్షేమ ప‌థ‌కాలకు పంచ‌డం అన్న‌ది అస్స‌లు త‌గ ని ప‌ని అని, ఇలాంటివి చేయ‌డం వ‌ల్ల సంప‌ద సృష్టి జ‌ర‌గ‌క‌పోవ‌డం వ‌ల్ల ఆర్థికంగా రాష్ట్రం మ‌రింత అప్పుల్లోకి పోతుంద‌ని హెచ్చ‌రిం చారు. ఆయ‌న‌కు ఉన్న వ్యూహం ఏంట‌న్న‌ది త‌న‌కు తెలియ‌దు అని, అదేవిధంగా రానున్న కాలంలో ఎవ‌రు ముఖ్య‌మంత్రి, ఎవ‌రు ప్ర‌ధాని అని చెప్పేంత మేథా శ‌క్తి త‌న‌కు లేద‌ని, తానేం జ్యోతిష్కుడ్ని కాన‌ని తేల్చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap