సమర్థ రీతిలో నాయకులు పనిచేయాలి. వారి గొంతుకలు వినిపించాలి. పార్టీ తీసుకునే లేదా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ప్ర జలకు సరైన స్థాయిలో అవగాహన కల్పిస్తే క్షేత్ర స్థాయిలో నెలకొనే అపోహలు అన్నవి అన్నీ తొలగిపోతాయి. కానీ దురదృష్టం ఏం టంటే వైసీపీ తరఫున మాట్లాడే గొంతుకలకు విషయ నిపుణత లేదు. విషయాన్ని విడమరిచి చెప్పే నైపుణ్యం చాలా తక్కువ. టు ద పాయింట్ మాట్లాడేవారే ఆ పార్టీలో అరుదు. ఎంత సేపు ఆరోపణలు, ప్రత్యారోపణలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్న వైసీపీ సర్కా రు మనుషులు ప్రజలకు వాస్తవాలు వివరించడంలో విఫలం అవుతున్నారు అన్నది సుస్పష్టం.  

సర్దుబాటు పేరిట విద్యుత్ ఛార్జీల పెంపుదలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల వెనుక అసలు కారణం గత ప్రభుత్వం అన్నది సుస్పష్టం. అయినప్పటికీ ఈ విషయమై టీడీపీపై సమర్థ రీతిలో వైసీపీ గొంతుక వినిపించలేకపోతోంది. అంతేకాదు ఆ రోజు జరిగిన కొనుగోలు ఒప్పందాలు (పబ్లిక్ అండ్ ప్రయివేట్ పార్టిసిపేషన్ పేరిట), వాటి వెనుక చంద్రబాబు, ఆయన మనుషుల మతలబులు ఇవన్నీ జనం ఎదుట ఉంచాల్సిన జగన్ ఎందుకనో తరుచూ తడబడుతున్నారు.


ఛార్జీల పెంపు జనం పై పెద్దగా ప్రభావం చూపదు అని చెబుతున్నారే తప్ప! ఎందుకు ఈ విధంగా పెంచాల్సి వచ్చిందో అన్నది దానిపై మాట్లాడేందుకు జగన్ పార్టీ అధికార ప్రతినిధు లు ముందుకు రావడం లేదు. మీడియా మైకుల ఎదుట తమ గొంతు విశ్లేషణాత్మక రీతిలోనో, వివరణాత్మక రీతిలోనో వినిపించలేక అవస్థ పడుతున్నారు.

ముఖ్యంగా అనేక మంది వైసీపీకి అధికార ప్రతినిధులు ఉన్నారు. జిల్లాల్లో కూడా పార్టీ తరఫున గొంతుకలు వినిపించే వారు ఉన్నారు. సర్దుబాటు పేరిట ఎందుకు ఛార్జీలు పెంచాల్సి వచ్చింది, ఇతర రాష్ట్రాలతోనో లేదా సంబంధిత కంపెనీల తోనో చంద్రబాబు చేసుకున్న ఒప్పందాలు ఏంటి?  వాటికి వత్తాసు పలికిన మీడియా శక్తులు ఎవరివి? ఇలాంటివాటిపై మాట్లాడేం దుకు విషయ నిపుణుల వెతుకులాటలో వైసీపీ ఉంటుందే కానీ, ఉన్నవాళ్లను వాడుకోవాలన్న ధ్యాసే లేదు. ధర్మాన ప్రసాదరావు లాంటి వారు వీటిపై సమర్థంగా గొంతు వినిపించగలరు.


అలానే ఆ స్థాయి మనుషులు కొనుగోలు ఒప్పందాల్లో చంద్రబాబు ప్రభు త్వం చేసిన తప్పిదాలేంటి? అందుకు దారి ఇచ్చిన పరిణామాలేంటి?  అన్నవి వివరించగలరు. కానీ సీనియర్లకు దూరంగా జగన్ ఉంటున్నారు. కాదు కాదు సీనియర్లను దూరంగా ఉంచుతున్నారు. దీంతో తరుచూ విషయ సంబంధ విచారణలో లేదా సంబంధిత  వివాదాల్లో గణాంక సహితంగా ఏం జరుగుతుందో అన్నది వైసీపీ తరఫున చెప్పేవారే కరవవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap