మిగతా పార్టీలు వేరు వాటి అధినాయకత్వాలూ వేరు. వాటికి కులాల ప్రాధాన్యం ఎంతో ముఖ్యం అన్నది ఓ విమర్శ కూడా! కానీ పవన్ ఇవేవీ పట్టించుకోడు. సామాజికవర్గాల సూత్రాలకూ వాటి కూడికలకూ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడు. అదేవిధంగా సమస్యను రాజకీయంగా వాడుకోవాలన్న యోచన ఉన్న నేత కాదు. సామాజిక సమస్యలపై తనతో సహా ప్రజలు కూడా పోరాడినప్పుడే ఫలితం ఉంటుందని చెప్పే నేత ఆయన. ముఖ్యంగా జనసేన ఆవిర్భావంలో కూడా కులరహిత రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తాను అని అన్నారు. సామాజికంగా ఒక నేత ఉన్నతి అన్నది అన్ని కులాల మద్దతుతోనే సాధ్యం అని నమ్ముతారు. కొన్ని చోట్ల తప్పక పోటీలో అదే సామాజికవర్గ నేతలను ఉంచినప్పటికీ, ఎక్కడా వివాదాలు రాకుండా  జాగ్రత్తలు తీసుకున్నారు ఆయన.

ఇది మిగతా పార్టీలలో కనిపించదు. కొన్ని సార్లు పొత్తులపై విమర్శలు వచ్చినా అవి కూడా ఆయన పట్టించుకోడు. ఆ రోజు ఏది మంచి అ నిపిస్తే అది చేశాం, కొన్ని కలిసిరాలేదు ఏం చేయను వదిలేయండి అని మాత్రమే తరుచూ సభల్లో చెబుతారు పవన్. అదేవిధంగా తనను వీడిపోయిన నేతలపై ఇప్పటికీ ఓ విమర్శ చేయరు. పల్లెత్తు మాట అననీయరు. ఒకవేళ ఎవ్వరు వ్యాఖ్యలు చేసినా వద్దనే చెబుతారు. నేను చెప్పానా విమర్శించమని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టమని మీరెందుకు నేను చెప్పనివి చేస్తారు అని ప్రశ్నిస్తారు. వద్దని వారిస్తారు. రాపాక (రాజోలు ఎమ్మెల్యే పూర్తి పేరు రాపాక వర ప్రసాద్) ఇష్యూలో కూడా ఆయన హుందాగానే ప్రవర్తించారు.



ప్రతి పార్టీ కులాలను నమ్ముకుని రాజకీయం చేయడంలో అర్థం ఉంటుంది. కొన్ని సార్లు అదే అనర్థాలకు దారి తీస్తోంది. టీడీపీ కానీ వైసీపీ కానీ ఓ ప్రత్యేక సామాజికవర్గం చేతి నుంచే ఎదిగాయి. వాటి కారణంగానే అవి మరికొంత రాజకీయం నడిపాయి. ఈ దశలో అవి పూర్తి స్థాయిలో వివిధ ప్రాంతాలలో బలపడ్డాయి. తమవి కాని కులాలను సైతం కొన్ని సార్లు మాత్రమే ప్రోత్సహించాయి. ఇప్పటి కీ రెడ్డి సామాజికవర్గంకు చెందిన వైసీపీలో కమ్మ సామాజిక వర్గం నేతలు ఎదగడం కష్టం అనే అంటుంటారు. అది నిజమే అని రాజ శేఖర్ రెడ్డిలా కాకుండా జగన్ కొన్ని సామాజిక వర్గాలపై అకారణ ద్వేషం ఎంచుకోవడం కానీ పెంచుకోవడం కానీ మంచిది కాదని అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. అలానే టీడీపీ  కూడా ఉత్తరాంధ్రలో కొన్ని సామాజికవర్గాల ఎదుగుదలను ప్రోత్సాహించింది. ఈ క్రమంలో కాళింగ, వెలమ, కాపు సామాజిక వర్గాలు బాగా బలపడ్డాయి. ఒకటి, రెండు చోట్ల దళిత, గిరిజన వర్గాలు బలపడినా వీటితో పోలిస్తే వాటి బలం చాలదు కూడా! కానీ పవన్ తన సొంత సామాజికవర్గ నేతలకు ప్రాధాన్యం తక్కువ ఇస్తారు అనేది వాస్తవం. తన సామాజికవర్గంకు చెందిన నేతలే అయినా కొందరి పేర్లు కూడా ప్రస్తావించరు. వారికి ఎంత పేరున్నా కూడా ఆయన మాత్రం తన ప్రసంగాల్లో పెద్దగా ప్రస్తావించరు. అలానే దళిత సామాజికవర్గ నేతలకు దగ్గరగా  ఉంటారన్న పేరు కూడా ఉంది. ఇతర పార్టీల కన్నా ఈయన సంబంధిత వర్గాలకు ప్రాధాన్యం ఇస్తారు. అలా అని వారిని రాజకీయ అవసరాలకు వాడుకోరు. పవన్ ఇతర పార్టీల కన్నా భిన్నంగా వ్యవహరిస్తానని ముందే చెప్పారు. ఆ విధంగానే ఆయన నడవడి ఉంటుంది. మిగతా పార్టీలలో ఉండే కులాల కుమ్ములాట కానీ ఆధిపత్య పోరు కానీ ఇక్కడ ఉండదు గాక ఉండదు. ఆయన ఒప్పుకోరు.


మరింత సమాచారం తెలుసుకోండి: