సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఎక్కడికైనా ఫంక్షన్ వెళితే డాన్సులు చేయడం లేదా ఏదైనా ఫన్నీ ప్రసంగాలు చేస్తూ అందర్నీ అలరించడం లాంటివి చేస్తూ ఉంటారు.  అయితే సినీ సెలబ్రిటీలు  సినిమాలో కూడా డాన్సులు చేస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా కార్యక్రమాల్లో డాన్సులు చేసినా పెద్దగా పట్టించుకోరు. కానీ ఇటీవల రోజుల్లో మాత్రం ఎంతో మంది రాజకీయ నాయకులు సైతం వివిధ శుభకార్యాలకు హాజరై అక్కడ డాన్సులు చేస్తూ అందరిని అలరిస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది ఎమ్మెల్యేలు సహా పలువురు ప్రజాప్రతినిధులు కొన్ని కార్యక్రమాల్లో డాన్సులు చేసిన వీడియోలు గత కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతు ఉన్నాయి.



 అయితే చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు ఇలా పబ్లిక్ లో డాన్స్ చేయడం లాంటివి చూశాము. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి లో ఉన్న వ్యక్తి పబ్లిక్ లో ఒక కార్యక్రమంలో డాన్స్ స్టెప్పులు వేయడం ఎప్పుడైనా చూసారా. ఇలాంటివి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఎవరైనా ముఖ్యమంత్రి డాన్స్ చేస్తే దానికి సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇటీవలే ఒక సీఎం అదిరిపోయే డాన్స్ చేసి ప్రస్తుతం అందరినీ ఆకట్టుకున్నాడు. పంజాబ్ రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పరిణామాల తర్వాత ఇటీవలే కొత్త ముఖ్యమంత్రిగా చరన్ జిత్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు.



 పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి ఇటీవలే ఒక కాలేజీ లో నిర్వహించిన కార్యక్రమంలో హాజరయ్యారు. విఐపి సీట్ లో సీఎం కూర్చున్న సమయంలో ముందు కాలేజీ విద్యార్థులు పంజాబీ సాంప్రదాయ బాంగ్రా డాన్స్ చేశారు. ఈ సమయంలోనే కొంత మంది వచ్చి మీరు కూడా మాతో పాటు డాన్స్ చేయాలి అని అడగడంతో వెంటనే ఓకే చెప్పిన సీఎం స్టేజి మీదికి వెళ్లాడు. ఇక అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న విద్యార్థులు అందరితో కలిసి అదిరిపోయే స్టెప్పులు చేసి ఆకట్టుకున్నారు సీఎం.  ఇక ఆ తర్వాత విద్యార్థులు అందరితో కలిసి ఫోటోలు దిగారు. అందరిని అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. జలంధర్ లోని ఐకే గుజ్రాల్ పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ కార్యక్రమంలో జిల్లా డాన్స్ చేశారు సీఎం.

మరింత సమాచారం తెలుసుకోండి: