తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి చెప్పే మాట‌ల‌పై ఆంధ్రా కూడా ఆస‌క్తిగానే ఉంది. కృష్ణా జలాల వివాదంపై ఆయ‌నేం చెప్ప‌నున్నారు?



కేసీఆర్ ఢిల్లీ డీల్స్ లో ఉన్నారు. మ‌రోవైపు ద‌ళిత బంధు ప‌థ‌కంకు చ‌ట్ట‌బ‌ద్ధ‌త తేవాల‌ని ప‌రిత‌పిస్తున్నారు. దీనిపై ఇవాళ నుంచి మొద‌ల‌య్యే అసెంబ్లీలో చ‌ర్చ పెట్టి, త‌రువాత చ‌ట్టం రూపం విష‌య‌మై ఓ క్లారిఫికేష‌న్ ఇవ్వాల‌ని ఆలోచిస్తున్నారు. కేసీఆర్ త‌న మాన‌స పుత్రిక అయిన ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ఇప్ప‌టికే హుజురాబాద్ లో ప్రారంభించారు. 1200 కోట్ల రూపాయ‌ల నిధులు కూడా విడుద‌ల చేశారు. అయితే ఈ ప‌థ‌కం అమ‌లుకు సంబంధించి తెలంగాణ వాకిట మిగ‌తా ప్రాంతాల నుంచి కూడా విన్న‌పాలు వ‌స్తున్న దృష్ట్యా దేశం యావ‌త్తూ గ‌ర్వించేలా దీన్నొక  ఐకన్ గా తీర్చిదిద్దాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. దీనిపై ఢిల్లీ  పెద్ద‌ల‌తోనూ చ‌ర్చించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. బీజేపీ స‌హా ఈ ప‌థ‌కం చాలా ఆస‌క్తిగా ఉంది. ఒక్కో ద‌ళిత కుటుంబానికి అర్హ‌త‌లు మేర‌కు ప‌ది ల‌క్షల రూపాయ‌లు వేయాల‌ని నిర్ణ‌యించారు. ఇలా చేయ‌డం వెనుక ఉన్న ఉద్దేశాలేంటి అని కేంద్రం కూడా ఆరా  తీయ‌నుంది. ఇవన్నీ  కేసీఆర్ చేప‌ట్ట‌బోయే ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో చ‌ర్చ‌నీయాంశాలు కావొచ్చు.

ఇంకా చెప్పాలంటే.......... :

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు కేసీఆర్ సిద్ధం అయ్యారు. ఇవాళ బీఏసీ మీటింగ్ త‌రువాత అసెంబ్లీ విధివిధానాలు ఖ‌రారు చేశాక ఢిల్లీ ఫ్లైట్ ఎక్క‌ను న్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండ‌నున్నారు. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న ఢిల్లీకి వెళ్ల‌డం ఇది రెండో సారి. ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్ కు భూమి పూజ చేశాక కొద్ది రోజులు గ‌డిపి వ‌చ్చారు. అప్ప‌ట్లో కొంద‌రు మంత్రుల‌ను కూడా  క‌లిసి వ‌చ్చారు. ఆ సంద‌ర్భంగా ప్ర‌ధానితో భేటీ అయి కొన్ని విష‌యాలు కూడా చ‌ర్చించారు. అయితే ఆ భేటీ కృష్ణా జ‌ల వివాదాల గురించి ప్ర‌ధానితో చ‌ర్చించ‌క‌పోవ డంతో వివాదాల‌కు తావిచ్చారు. ఈ సారి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధానితో కానీ ఇత‌ర ముఖ్యుల‌తో కానీ ఏం చ‌ర్చించ‌నున్నారు అన్న‌ది కీల‌కాంశం అయింది. కేంద్ర జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ తో భేటీ కానున్నార‌ని మాత్ర‌మే తెలుస్తుంది. కృష్ణా జ‌ల వివాదాల‌పై ఏం మాట్లాడుతారు అదేవిధంగా కేంద్రం నిర్మాణం నిలుపుద‌ల చేయాల‌న్న పాల‌మూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపై ఏం మా ట్లాడుతారు అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిదాయ‌కం. ఇవే కాకుండా మిగ‌తావాటిపై కూడా చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. మ‌రి! ప్ర‌ధాని క‌లిస్తే ఏమౌతుంది?


మరింత సమాచారం తెలుసుకోండి:

tg