లాభాల్లో ఉంటే సంస్థ‌ల‌ను న‌డిపే ప్ర‌భుత్వాలు న‌ష్టాల‌ను మాత్రం మోయ‌లేం అనే అంటున్నాయి. ఇదే క్ర‌మంలో త్వ‌ర‌లో కొన్ని అమ్మ‌కాల‌కు కూడా సిద్ధం అవుతున్నాయి. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంటు ను అమ్ముతానంటే , కేసీఆర్ ఆర్టీసీని అమ్ముతాన‌ని అంటున్నాడు. దీంతో వేలాది మంది జీవితాలు రోడ్డున ప‌డనున్నాయి. దేశంలోనే అతి పెద్ద ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌గా ఏపీఎస్ ఆర్టీసీ  పేరు తెచ్చుకుంది. రాష్ట్రం విడిపోయాక కూడా త‌న‌దైన సేవ‌ల‌ను అందించింది. త‌రువాత ప‌రిణామాల కార‌ణంగా తెలంగాణ‌లో ఉన్న 97 డిపోలూ న‌ష్టాల్లోనే ఉన్నాయ‌ని తేలిపోయింది. ఆర్టీసీ అమ్మ‌కం చేప‌డితే ఎవ‌రికి లాభం అనేదాని క‌న్నా న‌ష్ట‌పోయిన కార్మిక కుటుంబాల‌కు దిక్కెవ‌రు అన్న‌ది ఇప్పుడు సందిగ్ధంగా మారింది.




సంస్థ గాడిన పడేందుకు ప్ర‌తి ఏడాదీ నిధులు విడుద‌ల చేస్తూనే ఉన్నామ‌ని, త‌న ప‌రిధిలో కొంత, జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొంత నిధులు స‌ర్దుబాటు చేసి విడుద‌ల చేసినా సంస్థ న‌ష్టాల నుంచి కోలుకోవ‌డం లేద‌ని సీఎం అంటున్నారు. ఈ ఏడాది మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించామ‌ని వీటిని ప్ర‌ణాళిక‌, ప్రణాళికేత‌ర నిధుల నుంచి స‌ర్దుబాటు చేశామ‌ని చెప్పారు. ఏదేమైన‌ప్ప‌టికీ విలువయిన ఆస్తులున్న ఆర్టీసీని అమ్మాక పాల‌కులు సాధించేదేంటి? వైఎస్ భ‌క్తుడు బాజిరెడ్డి గోవ‌ర్థ‌న్ ను ఇర‌కాటంలో పెట్టే ప‌నే ఇది అవుతుందా?



ఆర్టీసీని అమ్మేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం అయ్యాయా ? అందుకు సీఎం కేసీఆర్ సిద్ధ‌మేనా? మ‌రి! వైఎస్ భ‌క్తుడు ఏం చేస్తున్నాడ ని? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వెతికే ప‌ని ఒక‌టి త‌ప్ప‌క చేయాలి. త్వ‌ర‌లో ఇందుకు సంబంధించి కొన్ని జ‌వాబులు కూడా వె లుగు చూడాలి. వాస్త‌వానికి ఆ మ‌ధ్య ఆర్టీసీ స‌మ్మె వేళ కేసీఆర్ ఎన్నో విష‌యాలు చెప్పారు. సంస్థ న‌ష్టాల‌ను అధిగ‌మించేందుకు ఏం చేయాలో కూడా సూచించారు. కానీ ఆర్టీసీ గాడిన ప‌డ‌లేదు. క‌రోనా కార‌ణంగా ఇంకా ఎక్కువ న‌ష్టాల్లో ఉంది. డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో ఆర్టీసీ ఆదాయం క‌న్నా ఖ‌ర్చు ఎక్కువ‌యిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియ‌ని స్థితిలో అధికారులు ప‌డ్డారు. రానున్న నాలుగు నెల‌ల్లో ఆర్టీసీని గాడిన పెట్టాల‌ని కేసీఆర్ ఇప్ప‌టికే ఎండీ స‌జ్జ‌నార్ కు చెప్పారు. ఇప్పుడేమౌతుంది?


మరింత సమాచారం తెలుసుకోండి:

tg