బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు పాదయాత్రతో స్పీడ్ గా ప్రజలకు దగ్గర కావాలని చూస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వాన్ని ఆయన ఇబ్బంది పెట్టే రాజకీయాన్ని నడుపుతున్నారు. పాదయాత్రలో ఆయన చేస్తున్న విమర్శలు తీవ్రంగానే ఉన్నాయి. మరోసారి ఆయన ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. రైతు రుణ మాఫీ , రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పై ముఖ్యమంత్రి కెసిఆర్ కు అయిదు పేజీల బహిరంగ లేఖ రాసారు బండి సంజయ్. 2018 ఎన్నికల సందర్భంగా తెరాస పార్టీ ఇచ్చిన లక్ష రూపాయల రైతు రుణ మాఫీని వెంటనే అమలు చెయ్యాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

రైతు రుణ మాఫీ క్రింద ఇవ్వాలిసిన 27 వేల 500 కోట్ల రూపాయల నిధులను డిమాండ్ చేసారు ఆయన. ముఖ్యమంత్రి  కేసీఆర్ వరి పంట వేయొద్దని ఇచ్చిన ప్రకటనను ఉపసంహరించుకోవాలి అని బండి ఆ లేఖలో డిమాండ్ చేసారు. ప్రధాన  మంత్రి ఫసల్ భీమా పధకం క్రింద రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా సొమ్ము 413. 50 కోట్ల రూపాయలను చెల్లించి రైతులను  ఆదుకోవాలి అన్ని బండి సంజయ్ కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మ హత్యలు అన్ని తెరాస ప్రభుత్వ  హత్యలే అని బండి అన్నారు.

రైతులకు ఉచితంగా ఎరువులు ఇచ్చి 2018 ఎన్నికలు సందర్భంగా తెరాస ఇచ్చిన హామీని నిలుపుకోవాలి అని బండి సంజయ్ కోరారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి, రైతులను దళారీల నుండి రక్షించాలి  అని బండి సంజ సిఎం కేసీఆర్ ను విజ్ఞప్తి చేసారు. ధరణిలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలి అని ఆయన లేఖలో కోరారు. రైతులకు  పట్టాదార్  పాసు బుక్కులను వెంటనే మంజూరి చెయ్యాలి అని బండి  సంజయ్ కోరారు. రైతులకు అండగా ఉండి వారి తరఫున బిజెపి తెలంగాణ శాఖ పోరాటం చేస్తుంది అని బండి స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts