కోవిడ్ అలర్ట్ : స్విట్జర్ ల్యాండ్ లోనూ నిరసన సెగలు
కోవిడ్ -19 ఆంక్షల నుంచి విముక్తి కోరుతూ ప్రజలు రోడ్లకెక్కుతున్న నగరాల జాబితాలో  స్విట్జర్ ల్యాండ్ దేశంలో ని బెర్న్ నగరం కూడా చేరింది.. వారం  రోజులుగా చెదురు మదురుగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నా.,, అవి తీవ్రరూపం దాల్చలేదు. తాజాగా అక్కడి ప్రజలు ఏకంగా  బెర్న్ పార్లమెంట్ భవనంలోకి చొచ్చుకొని వచ్చేందుకు ప్రయత్నం చేశారు.  పెద్ద సంఖ్యలోప్రజలు రోడ్లపైకి వచ్చి పార్లమెంట్ భవనం లోకి ప్రవేశించే  యత్నం చేశారు. 'స్వాతంత్య్రం కావాలి', 'పోలీసుల వైఖరి నశించాలి',  'పోలీసులు జులం నశించాలి' అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు.
ఉద్రిక్తక పరిస్థితులకు దారి తీయవచ్చునని భావించిన అక్కడి పోలీసుకు ముందస్తుగా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహించన  నిరసన కారులు బ్యారికేడ్లను తోసుకువెళ్లారు. పార్లమెంట భవనంలోకి చొ్చ్చుకు పోనీకుండా పోలీసులు  ఫైర్ ఇంజన్ లద్వారా నీటిని వేగంగా నిరసన కారులపై జల్లారు. దీంతో మరింత ఆగ్రహించిన  ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తు తమ ప్రయత్నాన్ని ముమ్మమరం చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో బాష్ప వాయువు ప్రయోగించారు. ఆ పై రబ్బర్ బుల్లెట్లను కూడా  నిరసన కారులై ప్రయోగించారు. ఈ ఘటనలు బెర్న్ నగరంలో కలకలం రేపాయి.
అంతకు ముందు  అధికార యంత్రాంగం కోవిడ్-19 ని అదుపు చేసేందుకు పలు నిబంధనలు విధించింది. లాక్ డౌన్ ను నేరుగా విధించక పోయినా పెద్ద సంఖ్యలో ఆంక్షలు  విదించింది. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్ట్లుగా సర్టిఫికేట్ ఉంటేనే  బహిరంగ ప్రదేశాలలో తిరిగేందుకు అనుమతించింది. బార్లు, జిమ్ లు, ప్రార్థనా స్థలాలు, చివరకు ఆసుపత్రులలో కూడా కోవిడ్ టీకా వేసుకున్నట్లు ధృవపత్రం ఉంటేనే లోనికి అనమతించాలని  ఆదేశాలలో పేర్కొంది. టీకా వేసుకున్నట్లు ఉండే ధృవపత్రం కాలపరిమితి జనవరి 2022 వరకే ఉంటుంది. ముందు నుంచి  స్విట్డర్ ల్యాండ్ ప్రజలు కోవిడ్-19 టీకాను వేసుకునేందుకు అంత సముఖత వ్యక్తం చేయలేదు. పూర్తిస్థాయిలో టీకా సామర్థ్యాన్ని పరీక్షించ లేదన్నది వారి వాదన. కేవలం అత్యవసర సేవల నిమిత్తం అంటూ కోవిడ్ టీకాను తమ మీద రుద్దడం సబబు కాదని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.  టీకా వేసుకోవడాన్ని నిరశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: