పాత మిత్రుల‌ను క‌లిసేందుకే ఇక్క‌డికి వ‌చ్చాన‌ని స‌డెన్ గా ఓ సెన్సేష‌న్ ఇచ్చారు జేసీ. సీఎల్పీ కార్యాల‌యానికి వ‌చ్చిన జేసీ ఆద‌రాబాద‌రాగా వ‌చ్చి వెళ్లారు. కేసీఆర్ ను పొగిడారు కూడా! ఎందుక‌నో ఆయ‌న బాబుపై ఫైర్ అయి, కేసీఆర్ మాత్రం మంచి వాడ‌నే చెప్పి వెళ్లారు.

చంద్ర‌బాబు ఇలాకాలో మంచి ప‌దవులు అందుకున్న కాంగ్రెస్ నేత జేసీ మాత్ర‌మే. త‌న డీఎన్ఏ కాంగ్రెస్ దేన‌ని మ‌రో మారు చాటు తూ కేసీఆర్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తి, తామేం న‌ష్ట‌పోయామో చెబుతూ సీఎల్పీ కార్యాల‌యంలో హ‌ల్ చ‌ల్ చేశారు. ఇవాళ కేసీఆర్ ను క‌లిసేందుకు ఇక్క‌డికి వ‌చ్చాన‌ని అన్నారు. మ‌రో మారు రాయ‌ల తెలంగాణ అంశాన్ని తెర‌పైకి తెచ్చి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.


టీడీపీలో విలువలు లేవ‌ని ఎట్ట‌కేల‌కు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు జేసీ దివాక‌ర్ రెడ్డి. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్న‌త ప‌ద‌వులు అందు కున్న ఆయ‌న ఇప్పుడు మాత్రం ఇలా మాట్లాడడం వెనుక ఉద్దేశం ఏంట‌న్న‌ది తెలియ‌డం లేదు. ఆయ‌న త్వ‌ర‌లో వైసీపీ గూటికి చేరుతు న్నారు అన్న వాద‌న కూడా ఉంది. కొంద‌రు బీజేపీకి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. తాను రాజకీయాల‌ను విలువ‌ల‌తో చేస్తా న‌ని త‌రుచూ చెప్పే నేత ఉన్న‌ట్టుండి టీడీపీ బాస్ చంద్ర‌బాబు నాయుడుకు ఝ‌ల‌క్ ఇచ్చారు. దీంతో అనంత రాజ‌కీయాల్లో వేడి రే గింది. తాడిప‌త్రి మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో త‌న స‌త్తా చాటుకున్న జేసీ త‌రువాత కాలంలోనూ అదే పోరు సాగిస్తున్నారు. త‌మ్ముడు ప్ర‌భాక‌ర్ రెడ్డి కూడా అదే స్పీడ్ లో మీసం మెలేస్తూ రాజ‌కీయ వ‌ర్గ పోరుకు సై అన్నారు. ఇప్పుడు మాత్రం టీడీపీని తాము వీడిపోతామ‌ని అంటున్నారు. వచ్చే ఎన్నిక‌ల్లో ఓటుకు నాలుగు వేల రూపాయ‌లు వెచ్చించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని అన్నారు. ఈ రోజు ఉన్న‌ట్టుండి తెలంగాణ సీఎల్పీ కార్యాలయంలో ప్ర‌త్య‌క్షం అయిన నేత ప‌లు ఆస‌క్తిదాయక వ్యాఖ్య‌లు చేశారు. అవ‌న్నీ ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap