ఆఫ్ఘన్ లో పరిణామాల నేపథ్యంలో భారత్ వివిధ దేశాల తో ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. అందుకే మోడీ వివిధ దేశాల ప్రతినిధులతో ఆయా విషయాల గురించి చర్చిస్తూనే ఉన్నారు. ఎన్ని చేసినా సొంత బలం, వ్యూహం తప్ప భారత్ కు మరొకరు మద్దతు ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు అనేది నిజం. దీనికి కారణం భారత్ అభివృద్ధిలో పరుగులు పెడుతుంది, చాలా త్వరగా మొదటి ప్రపంచాన్ని ప్రభావితం చేయనుంది అనే అంచనాలు. ఇవెప్పుడు నిజం అవుతాయో కానీ భారత్ పై కాస్త ఎక్కువ స్థాయిలో అంచనాలు పెట్టుకున్న దేశాలు వివక్షతో  అనేక కుట్రలకు పుంజుకుంటున్నాయి. ఆఫ్ఘన్ ఆక్రమణ కూడా అందులో భాగమే. కరోనా ను జనాభా ఎక్కువ ఉన్నందున ముందస్తు జాగర్తలు పాటించి అధిగమించిన కారణాన్ని చూసి కూడా ప్రపంచ దేశాలు భారత్ పై ఏడ్చి చేస్తుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇందులో చైనా, పాక్ లు ప్రధానంగా చెప్పుకోవచ్చు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో అన్ని దేశాలతో కలుపుకు పోవడానికి భారత నాయకత్వం ప్రయత్నిస్తుంది. ఎట్టి పరిస్థితులలోను దేశభద్రతపై వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేస్తుంది. ఇక తీవ్రవాదాన్ని పెంచి పోషించే వారిని ఉపేక్షించబోమని భారత్ ప్రపంచానికి తెలియజేస్తుంది. అందుకే కొన్ని దేశాలతో కలిసి క్వాడ్ కూటమిని ఏర్పాటు చేసింది. ఇలాంటి కూటములు గతంలో కూడా అనేక ప్రయోజనాల మేరకు ఏర్పాటు చేయబడ్డాయి.  ఈ కూటమి కూడా పలు ప్రయోజనాల కోసం ఏర్పాటు చేశారు. ఇలా ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ ప్రత్యేక కూటమిగా(ఏ.యూకే.యూస్.) ఏర్పాటు చేయబడింది. దీనిలో భారత్ ఎందుకు లేదు అనేది అందరి ప్రశ్న.

అయితే ఈ ఏ.యూకే.యూస్. కూటమి ఏర్పాటు కేవలం ఆయా దేశాల మిలిటరీ పెద్దల మధ్య కుదిరిన ఒప్పంద కూటమి మాత్రమే. ఈ కూటమిలో దేశాలు తమ శత్రు దేశాల అణుప్రయోగాల పై కన్ను వేసి ఉంచేందుకు మాత్రమే ఏర్పాటు చేయబడింది. ఇలాంటి మిలిటరీ కూటమి ఏర్పాటు ఆయా సందర్భాలలో చాలా సార్లు ఏర్పాటు చేసినప్పటికీ వాటిలో భారత్ ఏనాడూ సభ్యులుగా చేరలేదు. ఎందుకంటే అసలు ఈ కూటముల ఏర్పాటు స్వప్రయోజనాలకు మాత్రమే చేసింది. అంటే వీటిలో ఏ ఒక్క దేశం అయినా సొంత ప్రయోజనాలకు తప్ప  ఉమ్మడి ప్రయోజనాలకు పని చేయదు. అలాంటి కూటమిలో భారత్ మాత్రం ఏమి చేయగలదు, అందుకే దూరంగా ఉంటుంది. ఈ విషయం తెలియక  అందరు ఆ కూటమికి భారత్ ఎందుకు దూరంగా ఉంటుంది అని పలు విమర్శలు చేస్తున్నారు. సాధారణ కూటమితో ఉమ్మడి ప్రయోజనాలు నెరవేరుతాయి. అందుకే భారత్ అందులో స్థానం సంపాదించడం కూడా పెద్దగా కష్టపడదు, ఎందుకంటే ప్రపంచం భారత్ ను ఎప్పుడో అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా గుర్తించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: