రాజ‌న్న రాజ్యం తీసుకువ‌స్తాన‌ని తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టి దివంగ‌త ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ కూత‌రు వైఎస్ ష‌ర్మిల‌. పార్టీ పెట్టి ఏదో ఒక ప్ర‌జా స‌మ‌స్య‌పై పోరాడుతూ ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. ఇంత చేస్తున్న ఆమె పార్టీలో చేరిక‌లు మాత్రం జ‌ర‌గ‌డం లేదు. కొత్త‌గా చేరిక‌లు లేక‌పోగా ఉన్న నేత‌లో పార్టీని వీడుతున్నారు. ఆ మ‌ధ్య పాల‌మూరుకు చెందిన ఇద్ద‌రు నెత‌లు వైస్సార్టీపి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. అలాగే ఇందిరా శోభ‌న్ ష‌ర్మిల‌కు హ్యాండిచ్చారు. దీంతో అస‌లు ష‌ర్మిల పార్టీ తెలంగాణ‌లో నిల దొక్కుకుంటుందా అనే అనుమానం క‌లుగుతోంది.


   అయితే, ష‌ర్మిలా పార్టీ పెట్టి తెలంగాణ రాజ‌కీయాల్లో మార్పు తెస్తాన‌నుకుంది కానీ, ష‌ర్మిల పార్టీ వైపు ఏ ముఖ్య‌నాయ‌కుడు చూడ‌డం లేదు. దీంతో ష‌ర్మిల పార్టీ భ‌విష్య‌త్తు ఎంట‌నే ప్ర‌శ్న నెల‌కొంటోంది. ఈ క్ర‌మంలో ష‌ర్మిల పాద‌యాత్ర చేస్తార‌ని ప్ర‌క‌టించారు. అయితే, ఆమె పాద‌యాత్రతో పార్టీ స్వ‌భావం మారుతుందా  లేదా అనేది చూడాలి. అక్టోబ‌ర్‌లో చేవెళ్ల నుంచి త‌న పాద‌యాత్ర ప్రారంభం అవుతుంద‌ని ష‌ర్మిల ప్ర‌క‌టించారు. అయితే, పాద‌యాత్ర‌కు వ‌చ్చే ప్ర‌జ‌లు, అలాగే చేరిక‌ల‌పైనే ష‌ర్మిల పార్టీ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.


  పాద‌యాత్ర ద్వారా ష‌ర్మిల రాజ‌కీయ మైలేజ్ సాధిస్తారా అనే చ‌ర్చ మొద‌ల‌యింది. తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తీసుకువ‌స్తాన‌ని చెప్పిన ష‌ర్మిల పాద‌యాత్ర‌తోనే పొలిటిక‌ల్ మైలేజ్ ఎక్కువ‌గా తెచ్చుకోవాల్సి ఉంటుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. తెలంగాణ‌లో బ‌లంగా ఉన్న టీఆర్ఎస్ ఆ త‌రువాతి స్థానాల్లో ఉన్న కాంగ్రెస్‌, బీజేపీలో అవ‌కాశం దొర‌క‌ని వారే వైస్సార్టీపీలో చేరేందుకు అవ‌కాశ‌ముంటుంద‌ని అంద‌రికీ తెలిసిందే.ష‌ర్మిల అక్టోబ‌ర్ ప్రారంభించే పాద‌యాత్ర‌కు ప్ర‌జా ప్ర‌స్థానం అని పేరు పెట్టారు. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర ప్రారంభించిన చేవెళ్ల నుంచే ష‌ర్మిల కూడా  ప్రారంభిస్తారు.  అయితే, పార్టీకి సంస్థాగ‌త నిర్మాణం లేకుండానే, అలాగే స‌రైన నేత‌లు లేకుండానే పాద‌యాత్ర సిద్ధ‌మ‌య్యారు ష‌ర్మిల‌. ఈ నేప‌థ్యంలో స‌ర్వ‌త్ర ఆస‌క్తి నెల‌కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: