ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలల్లో కీలకమైన పరిషత్ ఎన్నికల విషయంలో వివాదాలు ఎక్కువగా నడిచాయి. పరిషత్ ఎన్నికలకు సంబంధించి విపక్షాలు అధికార పార్టీ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేసాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికకు మా 8 మంది సభ్యులు హాజరయ్యారు అని ఆయన పేర్కొన్నారు. టిడిపి, జనసేన వారు రాకపోవడంతో కోరం లేదని వాయిదా వేశారు అని ఆయన వెల్లడించారు. 9 మంది ఎంపీటీసీలు గెలిచినా టిడిపి ఎందుకు సమావేశానికి రాలేదో చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు.

టిడిపి నుంచి ఒక్కరు కూడా బీసీ గెలవలేదు అని నిలదీశారు. బీసీ ఎంపీటీసీ లేకపోవడం వల్లే టిడిపి ఎంపిపీ ఎన్నికకు హాజరు కాలేదు అని అన్నారు. మా పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు బీసీ సభ్యులను కొనుగోలు చేసేందుకు టిడిపి ప్రయత్నించింది అని ఆయన విమర్శించారు. ఎంపీపీ పదవికి ఉదయం 10 గంటలకే నామినేషన్ల సమయం ముగిసింది అని అన్నారు. వైసీపీ అభ్యర్ధి మాత్రమే నామినేషన్ వేశారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తాం అని ఆయన వెల్లడించారు.

దుగ్గిరాల ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యులుగా వైకాపా వారే గెలుస్తారు అని ధీమా వ్యక్తం చేసారు. ఇదిలా ఉంటే ఇటీవల దుగ్గిరాల ఎంపీటిసి కౌంటింగ్ ప్రక్రియ పై కోర్టు ను ఆశ్రయించింది జనసేన. పెదకొండూరు ఎంపీటిసి గా జనసేన అభ్యర్థి జోజిబాబు గెలిచారు. రీ కౌంటింగ్ లోను జనసేన అభ్యర్థి గెలిచారు అని చివరకు జనసేన అభ్యర్థి ని బయటకు నెట్టివేసి వైసిపి అభ్యర్థి గెలినట్లు ప్రకటన చేసారని జనసేన ఆరోపించింది. రాజకీయ వత్తిళ్లుతోనే ఎన్నికల ఫలితాలు తారుమారు చేశారు అని మండిపడ్డారు. పెదకొండూరు ఎంపీటిసి స్దానం రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: