ఎందరో  ప్రముఖులు విజయవాడ మంటిస్సోరి విద్యా సంస్థ లో చదివారు అని ఎంపీ రఘురామ కృష్ణం రాజు అన్నారు. రాష్ట్రంలో  ఎయిడెడ్  150 కళాశాలలు, వేల కొద్దీ పాఠశాలలు పేదవారికి విద్యను అందిస్తున్నాయి అని ఆయన తెలిపారు. సముచితమైన విద్యను తక్కువ ఫీజులకు అందించిందేకు ఎయిడెడ్ విద్యా సంస్థ లు ప్రయత్నిస్తున్నాయి అని ఆయన పేర్కొన్నారు. భూముల కోసం మా ప్రభుత్యం కన్ను ఇప్పుడు ఎయిడెడ్  విద్య సంస్థల పై పడింది అని మండిపడ్డారు. విద్య వ్యస్తను వివస్త్ర చేసే విధానం మా ప్రభుత్వం అనుసరించడం సిగ్గుచేటు అన్నారు.

కేవలం  భుదాహం తో చేస్తున్న స్థల యజ్ఞం ఇది అని విమర్శించారు. పని లేని వాడు పిల్లి జుట్టు కత్తిరించినట్లు ఉంది మా ప్రభుత్యం వైఖరి అని ఆరోపణలు చేసారు. ఎయిడెడ్ విద్య సంస్థలను నాశనం చేయాలని, భ్రష్టు పట్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఉపాధ్యాయులు, విధ్యార్ధులు ఉసురు మనకు అవసరమా జగన్ గారు అని ప్రశ్నించారు. టీటీడీ టికెట్లు అని కొడితే అది జియో మార్ట్ కు వెళ్ళింది అన్నారు. జియో మార్ట్ కు ముందు ఎలా తెలిసింది మన సిస్టమ్ పాడవుతుందని అని ఆయన ప్రశ్నించారు.

టీటీడీ టిక్కెట్లు విడుదల లో సాంకేతిక సమస్యలు ఉంటాయని జియో మార్ట్ కు ముందుగానే ఎలా తెలుసు అని ఆయన నిలదీశారు. జియో అంగడి లో దేవుడిని అమ్మకానికి పెట్టడం సిగ్గుచేటు అన్నారు. భవిష్యత్ లో శ్రీవారి ప్రసాదాలు జోమాటో, స్విగ్గిలో కొనుకోవలసి వస్తుంది అని భక్తులు భయపడుతున్నారు అని ఆయన ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట లో తెలుగదేశం, జనసెన కలిసి ఎంపీపీ అధ్యక్ష్య , ఉపాధ్యక్ష పదవులు కైవసం చేసుకోవడం స్థానిక సర్ధుబాటు అని అన్నారు. రాష్ట్ర స్థాయిలో సర్ధుబాటు జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు సంభవిస్తాయి అని ఆయన పేర్కొన్నారు. ఆ రెండు పార్టీల కలయిక మా పార్టీ కి చాలా కష్టాలు , ఇబ్బందులు తెస్తుంది అని ఆయన హెచ్చరించారు. అలాంటి పొత్తులు మా పార్టీ కి మంచిది కాదు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd