అనంత‌పురం జిల్లాకు చెందిన జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, దివాక‌ర్ రెడ్డి.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఏం చేస్తారు?  ప్ర‌స్తు తం వారి వైఖ‌రి చూస్తే.. ఎటూ నిర్ణ‌యించుకోలేక పోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. గ‌త రాష్ట‌ర విభ‌జ‌న త‌ర్వాత‌.. వారు.. వైసీపీ నుంచి ఆహ్వానం అందినా.. టీడీపీలో చేరారు. జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఈ క్ర‌మంలో.. గ‌త ఎన్నిక‌ల్లో వార‌సుల‌ను తెచ్చి.. ఎన్నిక‌ల్లో నిల‌బెట్టారు. అయితే.. ఇద్ద‌రూ ఓడిపోయారు. ఇక‌, అప్ప‌టి నుంచి టీడీపీలోనే ఉన్న‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు ఇస్తున్న పిలుపు మేర‌కు ఏ కార్య‌క్ర‌మాన్నీ ప‌ట్టించుకోవ‌డం లేదు. అంతేకాదు.. జ‌గ‌న్‌కు ఇట‌వ‌ల అనుకూలంగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

అదేస‌మ‌యంలో సొంత పార్టీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కేంద్రంగా జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌, మునిసిపాలిటీ ఎన్నిక‌ల్లోనూ.. తాడిప‌త్రి త‌మ‌కు ద‌క్క‌డం వెనుక జ‌గ‌న్ స‌హ‌కారం ఉంద‌న్నారు. దీనిపై టీడీపీలో అస‌హ‌నం వ్య‌క్త‌మైనా.. చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు ఏవ‌రూ నోరు విప్ప‌డం లేదు. ఇక‌, జేసీ బ్ర‌ద‌ర్స్ విష‌యంలో ఎవ‌రూ మాట్టాడ‌డం లేదు. మ‌రోవైపు.. వైసీపీ ఎమ్మెల్యే.. పెద్దారెడ్డి సైలెంట్ అయ్యారు. సో.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. జేసీ బ్ర‌ద‌ర్స్ వైసీపీ బాట ప‌డ‌తార‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి.

అయితే.. ఇవ‌న్నీ.. పైకి క‌నిపిస్తున్న‌వేన‌ని.. వారు టీడీపీలోనే ఉంటార‌ని .. కొంద‌రు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.. జేసీ దివాక‌ర్‌రెడ్డి.. జ‌గ‌న్‌తో స‌ర్దుకు పోయేందుకు రెడీగా లేరు. ప్ర‌భాక‌ర్‌రెడ్డి కొంత మేర‌కు జ‌గ‌న్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించినా.. దివాక‌ర్ మాత్రం విభేదిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ ఇద్ద‌రిలో ఒక‌రు టీడీపీలో ఉంటార‌ని.. మ‌రొక‌రు పార్టీ మారుతార‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇదిలావుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో దివాక‌ర్ మ‌ళ్లీ పోటీ చేస్తార‌ని అంటున్నారు. కానీ, దీనిపైనా క్లారిటీ లేదు. అయితే.. ఇద్ద‌రు సోద‌రులు.. కూడా వ్యూహాత్మ‌క రాజ‌కీయాలు చేస్తున్నార‌ని.. ఏ అవ‌స‌రానికి ఆ అవ‌స‌రం అన్న‌ట్టుగా రెండు పార్టీల విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అనేవారు కూడా క‌నిపిస్తున్నారు. మొత్తానికి జేసీ బ్ర‌దర్స్ ప‌రిస్థితి గోపీలుగా మారుతారా ? అనే  సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేలా చేస్తున్నాయ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: