టిఆర్ఎస్ ప్రభుత్వంపై భువన గిరి ఎంపి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. నల్లగొండ జిల్లాలోని  ముషంపల్లిలో బాధిత కుటుంబానికి లక్ష ఆర్థిక సహాయాన్ని ఇవాళ అందజేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   దుండగులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు   ద్వారా వెంటనే ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.  ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత ఎక్స్గ్రేషియా డబుల్ బెడ్ రూమ్ కాదు, ప్రజలకు రక్షణ కల్పించాలని టిఆర్ఎస్ సర్కార్ కు చురకలు అంటించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 

దేశంలో అత్యంత సమర్థ వంతమైన తెలంగాణ పోలీస్ అంటున్న సీఎం కెసిఆర్..  రోజు కో ఇలాంటి సంఘటన జరుగుతుంటే దీనికి మీరు ఏం సమాధానం చెబుతారని నిప్పులు చెరిగారు. నల్లగొండ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో కిరాణా, పాన్ షాపుల లో విచ్చల విడిగా గంజాయి అమ్ముతున్నారని మండిపడ్డారు.  ఎమ్మెల్యేల కు నాలుగు ఎస్కార్ట్ వాహనాలు ఎందుకు, ఇద్దరు గన్మెన్లు చాలు అని పేర్కొన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉన్న పోలీసు లంతా ఎమ్మెల్యేల రక్షణ కే పోతే తెలంగాణ  ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మద్యం పై  ఆదాయం రూ. 10 వేల కోట్లు అని కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో రాష్ట్ర ఆదాయం రూ.  40 వేల కోట్ల కు చేరిందని నిప్పులు చెరిగారు. అంత కు ముందు బెల్ట్ షాపు ల్లో మందు అమ్మితే పట్టుకొని ప్రభుత్వం  శిక్షించేదన్నారు.  కానీ టిఆర్ఎస్   ప్రభుత్వం లో బెల్టు షాపులను ప్రోత్సహించి మద్యం ఏరులై పారే విధంగా ప్రోత్సహిస్తున్నారని నిప్పులు చెరిగారు ఎంపి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి.  టిఆర్ఎస్ ప్రభుత్వం.. చాలా దౌర్జన్యంగా పాలిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు తగిన గుణ బుద్ది చెబుతారని హెచ్చరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: