ఏపీ వైద్య ఆరోగ్య శాఖా కమీషనర్ కాటమనేని భాస్కర్ మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రుల్లో ఎక్కడా ఔషధాల కొరత లేదు అని ఆయన స్పష్టం చేసారు. కాలం తీరిన మందులు కాదు అని పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా 5 నుంచి 6 రేట్ల మేర ఔషధాలు కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నాం అని ఆయన వివరించారు. మాలయతిన్ స్ప్రే డబ్బాలు ఆస్పత్రుల్లో నిల్వ పెట్టాం అని వివరించారు. ప్రస్తుతం దోమల సీజన్ కాబట్టి స్ప్రే డబ్బాలు ఉంచాం అన్నారు. 14,200 పోస్టుల కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అని పేర్కొన్నారు.

డాక్టర్లు, నర్సులు, ఫార్మసీస్ట్ ల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం అని ఆయన వెల్లడించారు. ఈ-ఔషది వెబ్ సైట్ లో ఎక్కడా సమస్యలు లేవు అని అన్నారు. సబ్ సెంటర్ స్థాయి వరకు టెలిమెడిసిన్ సేవలు తీసుకు వెళ్లాం అని పేర్కొన్నారు. ఔషధాల వినియోగంలో అత్యవసర పరిస్థితి ని అనుసరించి కేటాయింపు లు చేస్తున్నాం అన్నారు ఆయన. ఉదాహరణకు పాము కాటుకు వినియోగించే యాంటీ వెనం ఇంజెక్షన్ లు కొన్ని చోట్ల ఎక్కువ అవసరం అవుతుంది అని ఆయన తెలిపారు.

మరికొన్ని చోట్ల అంతగా అవసరం ఉండబోదు అని అన్నారు. దానికి అనుగుణంగా సమీపంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి తరలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. క్యాన్సర్ చికిత్స లో వాడే మందులు అవసరం కంటే ఎక్కువే ఉన్నాయి అని ఆయన అన్నారు.  గతంతో పోల్చుకుంటే మలేరియా కేసులు తక్కువగానే నమోదు అయ్యాయి అని వివరించారు. ప్రస్తుతం డెంగీ కేసులు పెరిగాయి అని అన్నారు. డెంగీ లో ప్రస్తుతం వచ్చిన స్ట్రెయిన్ తీవ్రంగానే ఉంది అని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో సర్వే చేయిస్తున్నాం అన్నారు. వర్షాలు వల్ల మురుగు నీటి నిల్వలు పెరిగి దోమ లార్వాలు ఈసారి ఎక్కువగానే ఉన్నాయి అని ఆయన అన్నారు. డెంగీ కోసం ఎలిసా పరీక్ష కిట్లు ఏరియా ఆసుపత్రుల్లో కూడా అందుబాటులో ఉన్నాయి అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap