విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసేది లేదని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వద్ద కేశినేని నాని స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో తన కుమార్తె ఓటమి తర్వాత ఆయన పెద్దగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సొంత పార్టీ నేతలు తన కుమార్తె ఓటమికి కారణమయ్యాయి అనే అభిప్రాయంలో కూడా  కేశినేని నాని ఉన్నారు. పలువురు కీలక నాయకులు విజయవాడలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే నాని కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది.

అయితే ఇప్పుడు అనూహ్యంగా కేశినేని నాని తీసుకున్న నిర్ణయంతో టిడిపి వర్గాలు షాక్ అవుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు కూడా  కేశినేని నాని తాను ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ప్రకటన చేశారు. అయితే అనూహ్యంగా ఆయన 2019లో పోటీకి దిగారు. అయితే మరోసారి వచ్చే ఎన్నికల్లో కూడా తాను పోటీ చేసేది లేదని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా పార్టీలో అనుకూల పరిస్థితులు లేకపోవడం అలాగే విజయవాడ నాయకులు తనను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడం  కేశినేని నాని లో అసంతృప్తికి కారణమైంది అని తెలుస్తుంది.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విజయవాడ లోనే ఉంటున్న కేశినేని నాని మాత్రం వెళ్ళి కలవడం లేదు. పలు ప్రాంతాల నాయకులు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తున్న  కేశినేని నాని మాత్రం అటు వైపు చూడటం లేదు. వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె కూడా పోటీ చేసే అవకాశం లేదని  కేశినేని నాని ప్రకటించారు. తన కుమార్తె ఇప్పటికే టాటా ట్రస్ట్ కు వెళ్లి పోయిందని... తాను పార్టీలో కొనసాగుతానని ఎన్నికల్లో పోటీ మాత్రం చేయనని  కేశినేని నాని తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: