దేశరాజధానిలో మద్యం ప్రియులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఇప్పటివరకు ఉన్న దుకాణాల లైసెన్స్ గడువు పూర్తి కావడంతో మూసివేశారు. మళ్ళీ కొత్త లైసెన్స్ లతో నవంబర్ లోనే తీరుస్తారని చెప్పడంతో మద్యం కోసం మందుబాబులు ఉన్న దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. ఈ నెల ఆఖరు వరకు మాత్రమే ప్రస్తుత దుకాణాలు అమ్మకాలు సాగించాల్సి ఉంటుంది. ఢిల్లీ ప్రభుత్వం కొత్త పాలసీ తేవడంతో అక్కడ నూతన లైసెన్స్ లు పొందాల్సి వచ్చింది. అవి జారీచేసినా కూడా అమ్మకాలు నవంబర్ లో ప్రారంభం అవుతాయి. ఇది ప్రైవేట్ దుఖాణాలకు వర్తిస్తుంది.

ప్రభుత్వ దుకాణాలలో మద్యం అన్ని రకాల బ్రాండ్ లు అమ్మరు. అందుకే ప్రైవేట్ బాట పడుతున్నారు మద్యం ప్రియులు. ఇప్పుడు అవి కూడా మూత పడుతుండటంతో కావాల్సిన బ్రాండ్ కోసం పరుగులు పెడుతున్నారు. దీనితో చాలా దుకాణాలలో స్టాక్ నిండుకుంది. తమ ప్రియమైన బ్రాండ్ దొరక్కపోవడంతో మద్యం ప్రియులు కొత్త ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే కావాల్సిన దానికోసం మళ్ళీ వేరే రాష్ట్రాల నుండి తెప్పించుకోవడం లాంటివి చేయాల్సి ఉంటుంది కదా. లేదంటే ఉన్న ప్రభుత్వ దుకాణాలలో దొరికిన దానితో నవంబర్ వరకు సర్దుకుపోవాల్సిందే.

మొత్తం ఢిల్లీలో మద్యం 32 జోన్ లలో 27మందికి మద్యం లైసెన్స్ లను ఇచ్చింది ప్రభుత్వం. ఒక్కో జోన్ లో మొత్తం పది వార్డులు ఉన్నాయి. అంటే మొత్తం 260 దుకాణాలలో ప్రైవేట్ వాళ్ళు మద్యం అమ్మకాలు చేపడుతున్నారు. ఇప్పుడు ఎక్సైజ్ పాలసీ గడువు ముగియడంతో సెప్టెంబర్ 30న దుకాణాలు మూతపడుతున్నాయి. కొత్త లైసెన్స్ లతో ఈ దుకాణాలు మళ్ళీ నవంబర్ 17న తెరుస్తారు. అప్పుడే మళ్ళీ అమ్మకాలు నిర్వహించాల్సి ఉంటుంది. అప్పటి వరకు ప్రభుత్వ దుకాణాలు శరణ్యం. ఈ విషయం మద్యం ప్రియులకు చేదుగానే ఉంటుంది. అయినా ఇవాళరేపు మద్యం కూడా ఆన్ లైన్ లో సరఫరా చేస్తున్నారు. మరి ఆ సౌకర్యం ఢిల్లీ లో లేకుండా ఉంటుందా.. ఉంటె ఇంత ఆందోళన ఉండబోదేమో! అంతగా అయితే వేరే రాష్ట్రాల నుండి తెప్పించుకుని స్టాక్ పెట్టుకుంటారు. ఇలాంటి వాటిలో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడంలో మనవాళ్ళు ఎప్పుడు ముందుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: