పవన్ స్టార్ పవర్ కళ్యాణ్ జోరు పెంచేశారు. సినిమాలను వరసబెట్టి చేస్తున్నారు. ఆయన రాజకీయాలు పెద్దగా పట్టించుకోవడంలేదు అని కూడా విమర్శలు ఉన్నాయి. మధ్యలో ఒకటీ అరా ప్రకటనలు తప్ప మరేమీ లేదని కూడా అంటున్నా కూడా అదంతా నిజం కాదు అన్నది కూడా ఆ పార్టీ నేతల వాదన.

పవన్ సినిమా షూటింగులలో ఉన్నా మధ్యలో వచ్చే గ్యాప్ లో ఆయన రాజకీయాల గురించే చర్చిస్తారు అంటున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ జనసేనకు ఈ మధ్య జరిగిన లోకల్ బాడీ ఎన్నికలు కొంత హుషార్ ని కలిగించాయని అంటున్నారు. పెద్దగా ప్రయత్నం చేయకపోయినా కేవలం క్యాడర్, పార్టీ అభిమానులే ముందుండి పోరాడి మంచి సంఖ్యలో సీట్లు సంపాదించారు. దాంతో పవన్ లో కొంత ఉత్సాహం కనిపిస్తోందిట.

తాను ముందుండి పోరాటం చేస్తే కచ్చితంగా జనసేన పార్టీఎకి మంచి పొలిటికల్ స్పేస్ ఉంటుంది అని పవన్ భావిస్తున్నారుట. ఇదిలా ఉండగా రెండున్నారేళ్ళుగా పెద్దగా సౌండ్ చేయని పవన్ తాజాగా చేసిన కామెంట్ మాత్రం మొత్తానికి మొత్తం సరిపోయింది అంటున్నారు. జగన్ ప్రభుత్వాన్ని ఆయన దౌర్భాగ్య పాలన అంటూ నిందించడం అంటే మామూలు విషయం కాదు. అంటే పవన్ ఒక విధంగా హెచ్చరిక జారీ చేశారు అనుకోవాలి.

తాను ఇక రంగంలోకి దిగుతాను అని కూడా చెబుతున్నారు. పవన్ ఇక మీదట ఏపీవ్యాప్తంగా పర్యటించి పార్టీకి కొత్త ఊపు తీసుకువస్తారని అంటున్నారు. మరో వైపు పార్టీ సమావేశాలను కూడా ఈ నెల 27న నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల తరువాత యాక్షన్ ప్లాన్ రెడీ చేసి దూసుకుపోవడమే అంటున్నారు. మొత్తానికి పవన్ స్పీడ్ చూస్తూంటే ఆయనలో పరిషత్ పరవశం ఒక్క లెక్కన లేదు అనిపిస్తోంది. ఆయన ఇదే స్పీడ్ లో రానున్న రోజుల్లో రాజకీయంగా మరింత దూకుడు చూపిస్తారు అని జనసైనికులు సంబరపడుతున్నారు. మరి పవన్ సత్తా చాటే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అంటున్నారు అంతా.




మరింత సమాచారం తెలుసుకోండి: