రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ మధ్య కాలంలో ఎక్కడా కలసిన సంఘటనలు లేవు. ముఖ్యంగా కరోనా తరువాత ఇద్దరూ భేటీ వేసినది అసలు లేదనే చెప్పాలి. ఈ మధ్యలో చాలానే జరిగిపోయాయి. దాంతో ఎవరి రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు అన్నట్లుగా చెరో స్టాండూ తీసుకున్నారు.

ఎవరి దారి వారిదే అన్నట్లుగా కూడా పాలిటిక్స్ నడుస్తోంది. ఈ నేపధ్యంలో ఇద్దరు సీఎం లు ఢిల్లీలో ఒకేసారి ఉండే సందర్భం వస్తోంది. మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే సమావేశానికి ఇద్దరికీ ఆహ్వానం లభించింది. ముందుగా కేసీయార్ ఢిల్లీ వెళ్లారు. జగన్ కూడా  వెళుతున్నారు.

ఇక కేసీయార్ తన ఢిల్లీ టూర్ ని మూడు రోజుల పాటు కొనసాగించనున్నారు. జగన్ అయితే రెండు రోజుల షెడ్యూల్ ని పెట్టుకుంటున్నారు. ఈ టూర్ లో ఇద్దరూ కేంద్ర మంత్రులను కలుస్తారు. అలాగే అమిత్ షాతో భేటీ అవుతారు అంటున్నారు. అదే విధంగా అనేక అంశాల మీద కూడా ఎవరి వాదన వారు కేంద్ర మంత్రుల వద్ద వినిపించనున్నారు. ఇవన్నీ పక్కన పెడితే గత కొంతకాలంగా సయోధ్య అన్నది లేకుడా తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయం సాగుతోంది. దాంతో ఢిల్లీ టూర్ లో జగన్ కేసీయార్ కలిసే అవకాశం ఉందా అన్న చర్చ అయితే ఉంది.

ఇక కేంద్రం ఈ ఇద్దరి మధ్యన మళ్లీ సయోధ్యను కుదురుస్తుంది అన్న మాట కూడా ఉంది. ముఖ్యంగా నీటి వివాదాలు ఉన్నాయి. అలాగే అనేక ఇతర విభజన అంశాలు కూడా ఉన్నాయి. కేంద్రం పెద్దన్న తరహాలో రెండు తెలుగు రాష్ట్రల మధ్య వివాదాలు తీర్చే అవకాశం ఉంది అంటున్నారు. అదే కనుక జరిగితే ఇద్దరు సీఎం  లు మళ్ళీ కలిసే చాన్స్ ఉంది. మొత్తానికి హస్తినలో ఇద్దరు సీఎంల కదలికల మీద అందరి దృష్టి ఉందని గట్టిగా చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: