ఏపీలో జిల్లా పరిషత్  ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం రంగం సిద్దం చేసింది.మధ్యాహ్నం 3 గంటలకు జడ్పీటీసీలను ప్రత్యేకంగా సమావేశమై సభ్యులంతా  జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు, కో ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా  ఎన్నికలు సజావుగా జరిగేందుకు వీలుగా అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. రిజర్వేషన్ల ప్రాతిపదికన అన్ని జిల్లాల్లో ఆయా పదవులకు  అభ్యర్థులను  వైకాపా ఫైనల్ చెయ్యగా . జడ్పీ ఛైర్మన్లు,వైస్ ఛైర్మన్లు,కో ఆప్టెడ్ సభ్యుల పేర్లను సభలో ప్రకటించి ఎన్నిక నిర్వహించనున్నారు.అత్యంత కీలకమైన ఎన్నికల దృష్ట్యా  పార్టీ పరంగా అభ్యర్థులకు  విప్ జారీ చేయనున్నట్లు తెలుస్తుంది.


జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఇప్పటికే ప్రకటించిన తదుపరి జడ్పీ చైర్మన్లు,  వైస్ ఛైర్మన్లు, కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు  నిర్వహిస్తోంది. 13 జిల్లాల్లో జిల్లా పరిషత్ కార్యాలయాల్లో నేడు   ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సమావేశానికి జడ్పీటీసీలంతా తప్పక హాజరుకావాలని సమాచారం అందించారు అధికారులు . జడ్పీటీసీలంతా కలసి  జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు , కో ఆప్టెడ్ సభ్యుల అభ్యర్థులను ఎన్నుకోనున్నారు. ఎన్నికల దృష్ట్యా జడ్పీటీసీల ప్రత్యేక సమావేశానికి  పోలీసులు అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించింది.అందుకోసం నేడు ఉదయం 10 గంటలలోపు నామినేషన్ల స్వీకరణకు అవకాశం కల్పించడంతో పాటు .ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ నామినేషన్ల పరిశీలన,మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్లు దాఖలు చేసిన తరువాత  అభ్యర్ధుల జాబితాను  ప్రకటించనున్నారు.మధ్యాహ్నం 1 గంటలోపు నామినేషన్లు ఉపసంహరణకు అవకాశం కల్పించారు అధికారులు .ఇక మద్యాహ్నం 1 గంటకు కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, ప్రమాణ స్వీకార ప్రక్రియ చేపట్టిన తరువాత . మద్యాహ్నం 3 గంటలకు జడ్పీ ఛైర్మన్,ఇద్దరు వైస్ ఛైర్మన్లు, ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు జడ్పీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, కో ఆప్టెడ్ సభ్యుల కోసం ఇప్పటికే రిజర్వేషన్లను ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు పార్టీకి విధేయులుగా ఉన్న వారిని సీఎం జగన్ ఎంపిక చేశారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేశారు. సామాజిక సమతుల్యం దెబ్బతినకుండా సోషల్ ఇంజనీరింగ్ పాటిస్తూ పదవులు కట్టబెట్టినట్లు తెలిపిన  వైసీపీ  ...జడ్పీ ఛైర్మన్ల పేర్లను ప్రకటించింది.

 
విజయనగరం జడ్పీ ఛైర్మన్ గా మజ్జి శ్రీనివాస్

శ్రీకాకుళం జడ్పీ ఛైర్ పర్సన్ గా  పిరియా విజయ

విశాఖపట్నం జడ్పీ ఛైర్ పర్సన్ గా అరిబీరు సుభద్ర

తూర్పుగోదావరి జడ్పీ ఛైర్మన్ గా విప్పర్తి వేణుగోపాల్

పశ్చిమ గోదావరి  జడ్పీ ఛైర్మన్ గా  కౌరు శ్రీనివాస్

కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్మన్ గా ఉప్పాళ్ల హారిక

గుంటూరు జిల్లా జడ్పీ ఛైర్మన్ గా  క్రిస్టినా

ప్రకారం జడ్పీ ఛైర్మన్ గా  బూచేపల్లి వెంకాయమ్మ

నెల్లూరు జడ్పీ ఛైర్ పర్సన్ గా  ఆనం అరుణమ్మ

కర్నూల్ జడ్పీ ఛైర్మన్ గా  వెంకట సుబ్బారెడ్డి

చిత్తూర్ జడ్పీ ఛైర్మన్ గా  వి. శ్రీనివాసులు

కడప జడ్పీ ఛైర్మన్ గా  ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి

అనంతపురం జడ్పీ ఛైర్ పర్సన్ గా గిరిజ
 
ఇదిలా ఉంటే ప్రతి  జిల్లాలో ఇద్దరిని జడ్పీ వైస్ ఛైర్మన్లుగా నియమించనున్నారు.వీరినీ రిజర్వేషన్లు ప్రకారం  పేర్ల జాబితాను  జిల్లాల పార్టీ ఇన్ చార్జిలకు పంపింది వైసీపీ అధిష్టానం . రేపు సమావేశం ప్రారంభానికి ముందు లేదా సమావేశంలోనే వీరి పేర్లు ప్రకటించి ఎన్నిక చేయనున్నారు.ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులను ఎన్నికల సంఘం ఇప్పటికే  ఆదేశించింది.  పార్టీ పరంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పార్టీనేతలను వైసీపీ అధిష్టానం జిల్లా నేతలను  ఆదేశించింది

మరింత సమాచారం తెలుసుకోండి: