ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో  సినిమా రంగంలో మార్పులు చేసి తీరుతామని జగన్ సర్కార్ తేల్చి చెప్పింది.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఇప్పటికే అనేక చర్యలు చేపడుతున్నామన్నారు మంత్రి పేర్ని నాని .అస్సలు ఆన్లైన్ టికెటింగ్ పై సినీ పెద్దలు ఏమంటున్నారు? దీనిపై సినీ పెద్దల వైఖరి  ఏంటి,? సినిమా పేరుతో పన్నులు ఎగ్గొడుతున్న వారిపై సర్కార్  ఫోక్స్ పెట్టిందా? లేక ఇదే పేరుతో సినిమా రంగంలో ఏపీలో సంస్కరణలు అమలు చేయబోతుందా ? అస్సలు రాష్ట్ర విభజన తరువాత  మొదటి సిని పెద్దల ప్రత్యేక భేటీపై ఎవరి వాదన ఏంటి  


రైల్వే టికెట్లు తరహలో సినిమా టికెట్లు అమ్మాకనికి ప్రభుత్వమే ఓ వెబ్ సైట్ ను రన్ చేసి టికెట్లు అమ్ముతుందని మంత్రి పేర్నినాని గతంలో ప్రకటించారు. దీనికి సంభందించి అధ్యయనం చేయడానికి హోం శాఖ ప్రిన్సిపల్  సెక్రటరీ నేత్రుత్వంలో  ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆగష్టు లో ఒక జీవోను సైతం ప్రభుత్వం విడుదల చేసిన ప్రభుత్వం  సినీ ప్రముఖుల విజ్జప్తి మేరకే తీసుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది.అయితే ప్రభుత్వమే ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళితే సకాలంలో టికెట్ డబ్బులు అందుతాయా అనే అనుమానాన్ని కొందరు సినీరంగానికి చెందిన వారు వ్యక్తం చేస్తుండగా  ఈ అనుమానాలు అన్ని నివ్రుత్తి చేయడానికి సినీరంగానికి చెందిన అన్ని విభాగాల ప్రతినిధులతో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో  చర్చించిన అనంతరమే ప్రభుత్వం నిర్వహించే టికెటింగ్ విధానాన్ని పకడ్బందీగా రూపోందిస్తామని ప్రభుత్వం వర్గాలు అంటూన్నాయి. అయితే ఆన్లైన్ టికెటింగ్ అయ్యాక  టికెట్ సోమ్ము కూడా రియల్ టైంలో భాగస్వామలు అందరికి వారివారి వాటా చేరేలా చర్యలు తీసుకుంటామంటున్న ప్రభుత్వం  ఎవ్వరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని  సినీరంగంతో సంభందం ఉన్న అన్ని విభాగాల పెద్దలతో చర్చించాకె అడుగులు వేస్తున్నామని అంటుంది. ఏపి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోని నిర్మాతలు, ఎక్సిబిటర్ లు , డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు ఇదే సమావేశంలో అటు డైరెక్టర్ లు, సినినటులతో సమావేశం నిర్వహించాలని భావించినా కొందరు హీరోలు దర్శకులు అందుబాటులో లేకపోవడంతో వారితో మరోరోజు సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.ఇదిలా ఉంటే సినిమా టికెట్లు ఆన్లైన్ లో విక్రయించాలని కేంద్రం 2002 లోనే ప్రతిపాదించిందని  మంత్రి పేర్ని అన్న్నారు  ఆ ప్రక్రియలో భాగంగానే  ఈ సమావేశం నిర్వహించామన్నారు. సగటు ప్రేక్షకుడికి టికెట్ రేటు అందుబాటులో ఉండడంతో పాటు అంతా పారదర్శకంగా ఉండేందుకే ఈ విధానాన్ని తీసుకువస్తున్నామని. ఇదిలా ఉంటే పండగలు పబ్బాలు ఉన్నప్పడు మీరు నిర్వహించే ఆర్టీసీ శాఖలు బస్సు చార్జీలు పెంచుకుంటారు. అదే పండగలు సమయంలో తము మాత్రం టికెట్ రేట్లు పెంచకుండా నయంత్రించడానికి జీవో 35లంటి జీవోలు తెస్తున్నారని కొందరు ప్రశ్నించడంతో ఆ జీవో పై పునరాలోచిస్తామని మంత్రి చెప్పినట్టు తెలుస్తోంది.మరోవైపు చిరంజీవిఆడియో ఫంక్షన్ లో చెప్పిన అంశాలను కూడా పరిగణలోనికి తీసుకుంటామన్న మంత్రి అందరికి అందుబాటులో వినోదం అన్నదే తమ అభిమతం అన్న ఆయన ప్రభుత్వం నిర్ధేశించిన రేట్లకే టికట్ల విక్రయాలు చేపడతామన్నారు.ఎవ్వరూ కూడా  బెనిఫిట్ షోల గురించి తమను అడగలేదన్నారు

 

ఇదిలా ఉంటే కొందరు నిర్మాతలు భారీ తారాగణం పెట్టి వందల కోట్ల రూపాయలతో సినిమా బడ్జెట్ ను పెంచేస్తున్నారని తరువత టికెట్ రేటు 500 నుండి 1000 అమ్మమంటే ప్రేక్షకులు తమను నోటికొచ్చనట్టు తిడుతున్నారని కొందరు ధియేటర్ యాజమానులు మంత్రి ద్రుష్టికి తీసుకువచ్చారు. కావాటంటే అలా అమ్మమన్న వారి పేర్లు కూడా చెపుతామని వారు అనడంతో అలా వ్యక్తిగతంగా పేర్లు వద్దని మంత్రి వారించి నట్టు తెలుస్తోంది.సినీ నిర్మాణం భారీ ఖర్చుతో కూడుకున్నదని అన్న మంత్రి ఆ ఇబ్బందులు కూడా తమకు తెలుసన్నరు. ఇదిలా ఉంటే పెద్ద సినిమాలకు టికెట్ రేటు కాస్తా ఎక్కువగా చిన్న సినామాలకు కాస్తా తక్కువగా పెంచుకునే వెసులు బాటు కల్పించాలని సినీ రంగ ప్రముఖులు కోరడంతో వాటని కూడా పరిశీలిస్తామని మంత్రి చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే చాల దియోటర్ల యాజమాన్యాలు బుక్ మైషో లాంటి టికెట్ ఆన్లైన్ సంస్ధలతో తాము దీర్ఘకాలం ఒప్పదం చేసుకున్నామని ఇప్పడు దాన్ని కాదని ప్రభుత్వం రూపోందించే ప్లాట్ ఫాంకు మారితే వారినుండి న్యాయపరమయిన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు ప్రస్తావించగా దానికి కూడా కమీటీ పరిష్కారం చూపిస్తుందని మంత్రి అన్నట్టు తెలుస్తోంది. ఒక వేళ అధిసాధ్యం కాకపోతే ప్రభుత్వం కూడా వారితరహలోనే తమ ప్లాట్ ఫాం ద్వారా టికెట్లు విక్రయించుకోనే అవకాశం ఉంటుందని వారు మంత్రికి తెలిపారు. ఇలా చేస్తే పోటీ పెరిగి డిస్కౌంట్ లు ఇవ్వడం ద్వారా అంతిమంగా ప్రేక్షకునికి మేలు జరగుతుందనే అభిప్రాయం వారు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని  ఎలాంటి ఆప్షన్ లు లేకుండా అమలు చేయాలని కోరామని సమావేశం అనంతరం సినీ ప్రముఖులు అంటున్నారు   మరోవైపు  ఏపిలో సినిమా షూటింగులు మరింతగా పెరుగుతాయని సిని ప్రముఖులు పేర్కోన్నారు. రాష్ట్రం విడిపోయిన అనంతరం సినీరంగంపై నిర్వహించిన ఈ సమావేశంపై తాము స్వాగతిస్తున్నామన్నారు. అటు బెనిఫిట్ షోల గురించి కూడ మంత్రి ద్రుష్టికి తెచ్చామన్న వారు అవసరం అయితే ప్రత్యేక అనుమతి ప్రభుత్వం వద్ద తీసుకొని వాటిని నిర్వహిస్తామన్నారు. ఇదిలా ఉంటే అన్లైన్ లో  పవర్ కట్ కారణంగా టికెట్ అమ్మాకాలు జరగకపోతే ఇప్పుడు ఉన్న శాటిలైట్ ప్రోజెక్టింగ్ సిష్టంలో ఖాళీ సీట్లకు సినిమా వేయాల్సిన పరిస్ధితి వస్తుందని కొందరు ప్రశ్నించారు. దీంతో ఈ విషయాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటామని మంత్రి పేర్కోన్నట్టు తెలుస్తోంది.


మొత్తానికి ఆన్ లైన్ ద్వారా టికెట్ లు అమ్ముకోవడం ద్వారా అంతో ఇంతో లాభార్జన చేసుకుందామని ప్రభుత్వం భావిస్తే అసలు ముందు మా సమస్యలు తీర్చండంటూ సినీ పెద్దలు సమస్యల చిట్టా విప్పడంతో సమావేశం అర్ధతరంగా ముగిసింది. టికెట్ ఆన్లైన్పై చేయడంతో పాటు మరిన్ని సంస్కరణలు అమలు చేయాలని చూస్తుంది జగన్ సర్కార్ చూడాలి రాబోయే ప్రభుత్వం తీసుకునే మార్పులకు అడుగులు పడతాయో లేదో

మరింత సమాచారం తెలుసుకోండి: