అగ్ర రాజ్యాధినేత జో బైడెన్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాదాపు గంటకు పైగా సమావేశం అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన తర్వాత తొలిసారి అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ ఎన్నో కీలకాంశాలపై ఆయనతో చర్చించారు. భారత్, అమెరికా సంబంధాల్లో సరికొత్త అధ్యాయానికి ఈ సమావేశం వేదిక కానుందని ఇద్దరు నేతలు కామెంట్ చేశారు. బైడెన్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ గతంలో 2014, 2016లో కలిసిన సందర్భాలను ప్రధాని మోడీ మరోసారి  నెమరేసుకున్నారు. ఐదేళ్ల క్రితమే భారత్ - అమెరికా మధ్య సంబంధాలు ఏ స్థాయిలో ఉండాలి.. స్నేహబంధం ఎలా కొనసాగాలి.. అనే అంశాలు చర్చించుకున్నటు బైడెన్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదగడానికి మోడీ ఎంతో కృషి చేశారని భారత్ ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు మోడీ పొడి తీవ్రంగా ఇస్తున్నారని బైడెన్ కీర్తించారు. 2006లో అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేసిన సమయంలోనే మోడీతో తనకు పరిచయం ఉన్నట్లు బైడెన్ గుర్తు చేశారు. నాటి నుంచి తమ‌ మధ్య స్నేహం కొనసాగుతోందని.. భారత్ తో అమెరికా మరింత సన్నిహితంగా మెలిగేందుకు తమ స్నేహం సహకరిస్తుందని బైడెన్ వెల్లడించారు.

ప్రస్తుత అఫ్ఘానిస్థాన్ పరిణామాలపై చర్చించిన ఇరు దేశాల అధినేతలు కొన్ని విషయాలపై కీలక దృష్టిసారించారు. ప్రధానంగా ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లకు చైనా సహకరించడం..  పాకిస్తాన్ కు ఆర్థిక సాయం చేయడం వంటి అంశాలపై మోడీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ అండ తోటే తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్లో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేశారని మోడీ వ్యాఖ్యానించారు. ఎల్వోసీ దగ్గర పాకిస్తాన్ ఇప్పటికే ఎన్నోసార్లు దురాక్రమణకు ఇచ్చిందని.. దీనిని భారత్ సైన్యం సమగ్రంగా తిప్పికొట్టిన సందర్భాలను మోడీ ప్రస్తావించారు. అఫ్ఘాన్ పరిణామాలు, చైనా ఆసక్తి చూపిస్తున్న అంశాలు.. అమెరికా - భారత్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని జో బైడెన్ వెల్లడించారు. ఐదు రోజుల పాటు అమెరికా పర్యటనలో ఉన్న మోడీ ప్రధానంగా అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, జపాన్ లతో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యం అని వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచానికి పెను సవాల్గా మారిన ఉగ్రవాదం, కరోనా మహమ్మారి, వాతావరణ పరిస్థితులపై మరింత కీలకంగా చర్చించాల్సిన సమయం వచ్చిందన్నారు ఇరు దేశాధినేతలు. ఇదే విషయంపై ఐక్య రాజ్య సమితిలో కూడా ప్రస్తావిస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో వైట్ హౌస్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో ఇరుదేశాల విదేశాంగ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: