ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఎన్నికలు ఏకపక్షంగా ముగిశాయి. నోటిఫికేషన్ వచ్చిన ఏడాది తర్వాత పోలింగ్ జరగడం... ఆ తర్వాత దాదాపు ఐదు నెలల తర్వాత ఐదు నెలలకు ఫలితాలు వెల్లడైన ఏకైక ఎన్నిక ప్రస్తుత జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు. ఈ ఎన్నికలను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ బహిష్కరించినప్పటికీ కొన్నిచోట్ల ఆ పార్టీ అభ్యర్థులు బరిలో నుంచుని గట్టి పోటీ ఇచ్చారు. అంతా అనుకున్నట్లుగానే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, మున్సిపల్ రిజల్ట్స్ మరోసారి రిపీట్ అయ్యాయి. మొత్తం 13 జిల్లాల్లో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జండా రెపరెపలాడింది. రాష్ట్రంలో గతంలో ఎన్నడు లేని విధంగా తొలిసారి మొత్తం 13 జిల్లాల్లో కూడా ఒకే పార్టీ జడ్పీ చైర్మన్ ల స్థానాలను కైవసం చేసుకుంది. పదమూడు జిల్లాల్లో కూడా వైసీపీ జెడ్పీ చైర్మన్ లు ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ఖరారు చేసిన వైసిపి అధిష్టానం ఆ అభ్యర్థులకు బి ఫామ్ పంపింది. చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లు ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా వ్యవహరించనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 660 జడ్పిటిసి స్థానాలకు 640 స్థానాల్లో ఎన్నికల జరిగాయి. జడ్పీ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియలో కొత్తగా ఎన్నికైన సభ్యులు చేతులు ఎత్తే విధానంలో ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ముందుగా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత ఒక్కో జిల్లాలో ఇద్దరు కో ఆప్షన్ సభ్యులు ఎన్నిక జరుగుతుంది. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత జడ్పీ చైర్మన్ తో పాటు జిల్లాకు ఇద్దరు చొప్పున వైస్ చైర్మన్ ఎన్నిక కూడా నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రిజర్వేషన్లకు అనుగుణంగానే కొత్త జడ్పీ చైర్మన్ లను వైసీపీ అధిష్టానం ఎంపిక చేసింది. చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులను పూర్తిగా పరోక్ష పద్ధతిలోనే జడ్పీటీసీలు ఎన్నుకొన్నారు. గతంలో ఉన్న ఒక వైస్ చైర్మన్ స్థానంలో ఇద్దరి ఎంపిక కోసం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ.. ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. జిల్లా పరిషత్ మాదిరి మండల పరిషత్ లో కూడా ఇద్దరు వైస్ చైర్మన్ లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఆర్డినెన్స్ ప్రక్రియ జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

మొత్తం 13 జిల్లాలకు సంబంధించి జడ్పీ చైర్మన్ ల పేర్లను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదించారు.
శ్రీకాకుళం - పిరియా విజయ
విజయనగరం- మజ్జి శ్రీనివాసరావు
విశాఖ - అరవీడు సుభద్ర
తూర్పుగోదావరి - విప్పర్తి వేణుగోపాలరావు
పశ్చిమ గోదావరి - కొవ్వూరి శ్రీనివాస్
కృష్ణ - ఉప్పల హారిక
గుంటూరు - కత్తెర క్రిస్టినా
ప్రకాశం - బూచేపల్లి వెంకాయమ్మ
నెల్లూరు - ఆనం అరుణ
కర్నూల్ - మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి
అనంతపురం - గిరిజ
కడప - ఆకేపాటి అమర్నాథరెడ్డి
చిత్తూరు - శ్రీనివాసులు

మరింత సమాచారం తెలుసుకోండి: