భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశఆర్ధిక పరిస్థితులను గాడిలో పెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా అనేక దేశాల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో విదేశీ యానాలకు కూడా ఆయా దేశాల నుండి అనుమతులు ఇప్పుడిప్పుడే  వస్తున్నాయి. ఇప్పటికి అక్కడక్కడా ఎవరైనా ఈ విషయంలో కాస్త ఆలోచిస్తుంటే మోడీ వారిని సమాధానపరుస్తూ విదేశీ యానాలకు సిద్ధంగా ఉన్న వారిని ఉత్సాహపరుస్తున్నారు.  దేశంలో వాక్సినేషన్ కూడా చురుగ్గా సాగుతుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనే వారికి ప్రత్యేకంగా రెండు డోసుల వాక్సినేషన్ చేయించి  మరి పంపిస్తున్నారు.

దేశంలో  ఎన్నికలు ఉన్నప్పటికీ మోడీ అమెరికా ప్రయాణం కావాల్సి వచ్చింది. ఆర్థికవ్యవస్థను చక్కదిద్దటంలో వాణిజ్య లావాదేవీల ప్రాముఖ్యత అధికం కాబట్టి దానికి అమెరికాలో కొత్తగా ఏర్పాటు అయిన ప్రభుత్వంతో చర్చల ద్వారా దేశానికి కలిసి వచ్చే అంశాలపై చర్చిస్తున్నారు మోడీ. అమెరికా భారతీయ మానవ వనరులపై, అలాగే ఎగుమతులపై ఆంక్షల నేపథ్యంలో వాటిని పునరుద్ధరించేందుకు మోడీ ఈ టూర్ వెళ్లినట్టు తెలుస్తుంది. ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ సహజంగా బీజేపీ సభ్యుడు కావడంతో ఆ పార్టీ పై ఉన్న మతతత్వ పార్టీ అనే నిందను తాను మోయాల్సి వస్తుంది. మోడీ అమెరికా టూర్ లో మతతత్వ పార్టీలతో ప్రజాస్వామ్య దేశం కలిసి పని చేయరాదు అంటూ వైట్ హౌస్ ఎదుట కొందరు నిరసనలు చేస్తున్నారు.

వీళ్లు గో బ్యాక్ మోడీ అంటూ ఫ్లెక్సీలు పట్టుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు. కేవలం మత ప్రాతిపదికన పని చేసే మోడీ తో ఎటువంటి సంబంధబాంధవ్యాలు  తమకు అవసరం లేదని తేల్చి చెప్పేయాలని వారు అమెరికా అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అస్సాం, కాశ్మీర్, మైనారిటీ కొత్త చట్టాలు వంటి సమస్యలను వారు ప్రస్తావించారు. మతం ప్రాతిపదికన రాష్ట్రాలలో చిచ్చుపెట్టి బీజేపీ బ్రతికేస్తుందని వాళ్లు నిరసన వ్యక్తం చేశారు. అయితే ఇదంతా పాక్, చైనా ప్రేరేపిత అంశంగా చాలా మంది అభివర్ణిస్తున్నారు. ఇవన్నీ పట్టించుకోని మోడీ తాను వెళ్లిన పని మాత్రం చేసుకుంటూ పోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: