తెలంగాణా బిజెపి స్టేట్ చీఫ్ గా బాద్యతలు తీసుకున్న తర్వాత... బండి సంజయ్ విమర్శలు చాలా తీవ్రంగా చేయడం మనం చూస్తున్నాం,. అన్ని అంశాల మీద కూడా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. రాజకీయంగా ఇప్పుడు తెలంగాణాలో ఆయన బిజెపి కి స్టార్ ఇమేజ్ గా మారిపోయారు. ఆయన పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందనకు సంబంధించి బిజెపి నాయకత్వం సంతోషంగా ఉంది. బిజెపి జాతీయ నాయకులు ఆయనకు నిత్యం ఫోన్ లు కూడా చేస్తూ యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు.

ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే బండి సంజయ్ పాదయాత్రకు ఏ ఇబ్బందులు రాకుండా తన వంతుగా కష్టపడుతున్నారు. కొన్ని కొన్ని విమర్శల్లో బిజెపి వెనుకబడుతుంది. బండి సంజయ్ మాత్రం ఎక్కడా కూడా తగ్గడం లేదు. సిఎం కేసీఆర్ ను ఆయన విమర్శిస్తున్న విషయంలో అధికార పార్టీ కోపం గా ఉంది. అయినా సరే బండి సంజయ్ తన పంథాలోనే ముందుకు వెళ్తున్నారు. స్థానిక సంస్థలను కేసీఆర్ అనే ముర్కుడు నాశనం చేస్తున్నాడు అని ఆయన ఆరోపించారు. సర్పంచ్ లకు కేసీఆర్ ఒక్క రూపాయి ఇవ్వలేదు అని అన్నారు.

300 ఎకరాల ఫార్మ్ హౌస్ లో కేసీఆర్ దొడ్డు వడ్లు పండిస్తున్నారు అని మరి రైతులు ఎందుకు సన్న వడ్లు పండించాలి అని ఆయన ప్రశ్నించారు. ఏడేళ్లలో ఒక్కరికి కూడా పంట నష్ట పరిహారం ఇవ్వలేదు అని అన్నారు. పంట నష్టపోయి యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆయన విమర్శించారు. పండించిన ప్రతి గింజా కొనాల్సిందే అని స్పష్టం చేసారు. కిలోమీటర్ కో బార్ పెట్టాడు కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ ఇంట్లోనే ఐదు ఉద్యోగాలు ఉన్నాయి అని విమర్శలు గుప్పించారు. భాషలో నాకు గురువు కేసీఆరే అని అన్నారు  బండి సంజయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts