తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అనేది చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. అన్ని పార్టీల అధ్యక్షులు వ్యూహాలతో ముందుకు పోతున్నారు. తమ మార్కు రాజకీయాన్ని  ముందుకు తీసుకెళ్తూ  ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయిన తర్వాత  పార్టీలో కొత్త జోష్ మాత్రం కనబడుతోంది. రేవంత్ రెడ్డి తమదైన శైలిలో అందరినీ కలుపుకు పోతూ ముందుకు వెళ్తున్నారు. కానీ కాంగ్రెస్ లోని కొంతమంది సీనియర్ నేతలకు ఇది మింగుడు పడడం లేదని సమాచారం. జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి పై కోపానికి వచ్చిన విధానాన్ని చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. నాకు కూడా అభిమానులు ఉన్నారని నేను కూడా కావాలంటే పార్టీ సపోర్టు ఏ విధంగా లేకుండా  రెండు లక్షల మందితో సభ కూడా పెట్టి ఇస్తానని అన్నారు.

 ఎథిక్స్ కోసం మాత్రమే పార్టీలో ఉంటున్నానని, పార్టీ మారాలనుకుంటే అడ్డు ఎవరు కూడా ఉండాలని రాజకీయాల్లో ఎప్పుడు హీరోయిజం పనిచేయదని నేను కావాలంటే రెండు లక్షల మందితో సభ పెట్టగలరని  ఆయన తీవ్రమైన కామెంట్ చేశారు. ఇలా జగ్గారెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి తన వాయిస్ ను వినిపించారు. రేవంత్ రెడ్డి వ్యవహారం మీద బహిరంగంగానే మాటల తూటాలు పేలుతున్నాయి అని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన అనంతరం ఆయన మీడియా చిట్ చాట్ లో తన మనసులోని మాటను బయట పెట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కాంగ్రెస్కు ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే నేనేనని, నాకు గజ్వేల్ లో మాట్లాడడానికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు అని, ఎవరో ఒత్తిడి మీద గీతారెడ్డి నాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలేదు అని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో అర్థం అవ్వడం లేదని అన్నారు.

ఒకరి నెత్తి పై మరొకరు చేయి పట్టుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అని, కాంగ్రెస్ పార్టీ లో జరిగే టువంటి అన్యాయాలపై ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో మా పై విషప్రచారం కూడా చేస్తున్నారని, పార్టీ మారాలంటే నాకు అడ్డు ఎవరు కూడా లేరని  జగ్గా రెడ్డి ప్రశ్నించారు. కేవలం సిద్ధాంతాల కోసం ఏ పార్టీలో కొనసాగుతుందని, సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్నానని, ఇప్పటికే కాంగ్రెస్ లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకు గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో హీరోయిజం అనేది పనిచేయదని, రజినీకాంత్ చిరంజీవి లాంటి వాళ్లే కనుమరుగై పోయారని, కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలి అంటే  గ్రామ స్థాయిలో నుంచి పని మొదలు పెట్టాలని అన్నారు. తెలంగాణలో నాకు కూడా అభిమానులు ఉన్నారని కావాలంటే రెండు లక్షలు పైగా మందితో సభ కూడా పెట్టి శక్తి నాకు ఉందని  తెలియజేశారు. తప్పని పరిస్థితుల్లో నే ఈ విషయాలను బయట పెడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి..

మరింత సమాచారం తెలుసుకోండి: