పోస్టర్ కేర్(సంరక్షణ) కు రాష్ట్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. దానికి తగ్గ మార్గదర్శకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం కోరుకున్న వారికి పిల్లలను అప్పగించిన అనంతరం కూడా వారి సంరక్షణ తృప్తిగా ఉందని తేలితేనే దత్తత కు అనుమతి ఇస్తారు. మంత్రివర్గ అనుమతితో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ నియమనిబంధనలపై కసరత్తు చేయనుంది. ఇందులో ముందుగా పిల్లలు లేని వారు, అనాథలను సంరక్షించాలని అనుకునేవారు, ఎవరు లేనివారిని పెంచి పోషించడానికి ముందుకొచ్చే వారి కోసం ఆయా కుటుంబాలు అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను మహిళా శిశు సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, పొలిసు శాఖ వారు సమీక్షిస్తారు.

అనంతరం అధికారులు ఆయా కుటుంబాలకు లేదా సంరక్షణ సంస్థలకు పిల్లలను అప్పగిస్తారు. వీళ్లకు వారు అడిగిన వయసు పిల్లలు అంటే పుట్టిన శిశువు నుండి ఆరేళ్ళ వయసు పిల్లలను దత్తత ఇస్తారు. ఆరు నుండి ఎనిమిదేళ్ల పిల్లలను సంరక్షణ(పోస్టర్ కేర్) కు అప్పగిస్తారు. అనంతరం అధికారులు సంరక్షకులు పిల్లలను ఎలా చూసుకుంటున్నారు అనేది రెండేళ్ల పాటు ఆకస్మిక తనిఖీల ద్వారా పరీక్షిస్తారు. ఆ సంరక్షణపై అధికారులు సంతృప్తి చెందితే అప్పుడు దత్తతకు అనుమతి ఇస్తారు. ఇక ఎనిమిది నుండి 18 ఏళ్ళ లోపు పిల్లలను సంరక్షకులకు అప్పగిస్తారు. వీరిని కూడా ఏడాది పాటు అధికారులు తనిఖీ చేసి అనంతరం తృప్తి చెందితేనే దత్తతకు అనుమతి ఇస్తారు.

అసలు దత్తతతో నిమిత్తం లేకుండా బాలల సంరక్షణ బాధ్యతలు తీసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సంరక్షణ కు ఇస్తారు. పలు దత్తత కార్యక్రమానికి ఇప్పటికే అధికారుల సూచన మేరకు పలువురు 3354 దరఖాస్తులు చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బాలల సంరక్షణ కేంద్రాలలో 18 ఏళ్ళ లోపు వారు 143 మంది ఉన్నారు. వారిలో 75 మంది బాలలతో పాటుగా 68 మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 2304 మంది రెండేళ్ల చిన్నారుల కోసమే అని అధికారులు తెలిపారు. ఈ దరఖాస్తులను తాజా మార్గదర్శకాల మేరకు పరిశీలించి దత్తత కు ఇస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: