తమిళనాడులోని కడలూరు జిల్లాలో 18 ఏళ్ళ క్రితం జరిగిన పరువు హత్య కేసులో ఎట్టకేలకు న్యాయం జరిగింది. ప్రత్యేక న్యాయస్థానం ద్వారా 18 ఏళ్ల క్రితం జరిగిన కేసులో ఎట్టకేలకు న్యాయం జరిగడం పట్ల హర్షం వ్యక్తమవుతుంది. 2003 లో జరిగిన 'పరువు హత్య' కేసులో, ఒక వ్యక్తికి మరణశిక్ష మరియు ఇద్దరు పోలీసు అధికారులతో సహా మరో 12 మందికి జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం. శుక్రవారం, కేసును విచారించిన కోర్టు మహిళ సోదరుడు మరుధు పాండియన్‌ కు మరణశిక్ష విధించింది.

అదే విధంగా ఆమె తండ్రి దురైస్వామి, ఇప్పుడు రిటైర్ అయిన అప్పటి ఇన్‌స్పెక్టర్ చెల్లముత్తు మరియు ఇప్పుడు ఇన్‌ స్పెక్టర్‌ గా ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్ తమిళ్‌ మరన్‌ తో సహా మరో 12 మందికి జీవిత ఖైదు విధించారు. 18 ఏళ్ళ క్రితం మే 2003 లో, 22 ఏళ్ల డి కన్నగి అనే మహిళా ఆధిపత్య కులానికి  చెందిన ఎస్. మురుగేశన్ (25) ని వివాహం చేసుకుంది. అయితే కుటుంబానికి అలాగే సమాజానికి భయపడి... వేరుగా నివసించింది కుటుంబం. వారి వివాహం జరిగిన ఒక నెల తరువాత, ఆ మహిళ కుటుంబం వారి వద్దకు వెళ్ళింది.

అక్కడి నుంచి ఇక వారికి కష్టాలు మొదలయ్యాయి. కుటుంబం వారిని క్షమిస్తుందని భావించి వారు ఇంటికి తిరిగి వచ్చేశారు. అయితే వారి హత్యకు ప్లాన్ సిద్దం చేసుకున్న అమ్మాయి కుటుంబం అబ్బాయిని చంపాలని నిర్ణయం తీసుకుంది. హత్యకు ముందు చెన్నై నుండి 230 కి.మీ దూరంలో ఉన్న కుప్పనాథంలో గ్రామస్తుల ముందు ఈ జంటను మొదట చిత్ర హింసలకు గురి చేసారు. ఆ తర్వాత వాళ్లకు ముక్కు నుంచి చెవుల నుంచి విషం ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరినీ దహనం చేసారు. ఆ ఊరి గ్రామ పెద్దగా అమ్మాయి తండ్రి ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: