అనేక ఆశ్చర్యకర పరిణామాల మధ్య తాలిబన్ లు ఆఫ్ఘన్ ను ఆక్రమించిన విషయం తెలిసిందే. వెంటనే తాత్కాలిక ప్రభుత్వం కూడా ఏర్పాటు చేశారు తాలిబన్లు. అయితే ఈ కేబినెట్ లో ఎక్కువ మంది గత తాలిబన్ రాజ్యం లో పలు విభాగాలలో పనిచేసిన వారే ఉండటం తో  ప్రస్తుత ప్రభుత్వం పనితీరు ఎలా ఉండబోతుంది అనేది దాదాపుగా ప్రపంచానికి అర్ధం అయ్యింది. అయినా తాము మారాము అని చెప్పుకొస్తున్న తాలిబన్లు గుర్తింపు కోసం ఆరాటపడుతున్నారు. సరాసరి ఐక్యరాజ్య సమితికి కూడా ఈ మేరకు తాలిబన్ కొత్త ప్రభుత్వం ఓ లేఖ రాసింది. దానికి సమాధానంగా ఐరాస మాట్లాడుతూ, మేము తాలిబన్ల దేశాన్ని గుర్తించలేము, ఐరాస సభ్య దేశాలు గుర్తించాలి అని స్పష్టం చేసింది.

ఈసారి తాలిబన్లు జైళ్లు, శిక్షల శాఖకు నేతగా ముల్లా నూరుద్దీన్ నియమించారు. ఈయన గత తాలిబన్ ప్రభుత్వంలో పని చేసిన వారి సంతానం. తండ్రి ఎంత క్రూరుడో, ముల్లా అంతకంటే పెద్ద క్రూర స్వభావం ఉన్నవాడిని అందుకే శిక్షల శాఖను అతడికి అప్పగించారు అని తెలుస్తుంది. ప్రస్తుతం ఆఫ్ఘన్ లో ఆహార కొరత సహా పలు సంక్షోభాలు స్వైరవిహారం చేస్తున్నాయి. కనీసం దేశం విడిచి వెళ్ళడానికి లేక ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. చాలా మంది పాక్ సరిహద్దులలో దేశంలో ప్రవేశించడానికి వేచి చూస్తున్నారు. అమెరికా ఆఫ్ఘన్ ప్రభుత్వ ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో బ్యాంకుల నుండి కూడా డబ్బులు తీసుకోలేక ప్రజలు వారి ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులు అమ్ముకుంటూ కాలం గడిపేస్తున్నారు.

అయితే తాజాగా ఓ మీడియా సంస్థ తో ముల్లా మాట్లాడారు. ఆయన మాటల ప్రకారం త్వరలోనే గతంలో తాలిబన్ లు విధించిన శిక్షలను అమలులోకి తెస్తున్నట్టు తెలిపారు. అప్పట్లో శిక్షలు అంటే కాళ్ళు చేతులు నరికేయడం, ఇంకా పెద్ద తప్పు చేసిన వారికి తల నరకడం, రాళ్లతో కొట్టి చంపడం వంటివి ఉండేవి. షరియా చట్టం ప్రకారం పెళ్ళికి ముందు సెక్స్ నేరం, దానికి శిక్ష కొరడా తో చనిపోయే వరకు కొట్టడం; పెళ్లి అయినవారు అక్రమసంబందాలు పెట్టుకుంటే రాళ్లతో కొట్టి చంపడం; దొంగతనాలు చేసేవారికి చేతులు నరికేయడం వంటివి అమలులోకి రానున్నాయి. అప్పట్లో గడ్డం లేకుండా ఉండటం, సంగీతం వినడం కూడా నేరాలుగా పరిగణించేవారు. టీవీలు మొబైల్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం కూడా తప్పే. ఇవన్నీ మళ్ళీ అమలు చేయబోతున్నట్టు ముల్లా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: