అనంత‌పురం వైసీపీలో వ‌ర్గ పోరు రోడ్డెక్కింది. ముఖ్యంగా అన్నిచోట్లా ఉన్న‌ట్టుగానే.. ఇక్క‌డ కూడా ఎంపీటీ సీ , జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో నేత‌ల మ‌ధ్య వ‌ర్గ పోరు క‌నిపించింది. అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా.. సాధించిన ప‌రిష‌త్ ఫ‌లితాన్ని ఎంజాయ్ చేసే స‌మ‌యానికి ఈ వ‌ర్గ పోరు ప్రారంభం కావడం.. పార్టీలో తీవ్ర ఆవేద‌న‌కు, ఆందోళ న‌కు దారితీస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. అనంత‌పురం.. జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల బాధ్య‌త‌ల‌ను ఎంపీ త‌లారి రంగ‌య్య‌.. మంత్రి శంక‌ర‌నారాయ‌ణ‌కు అప్ప‌గించారు. అయితే. వీరిద్ద‌రూ.. మాకెందుకులే అనుకుని.. బాధ్య‌తల విష‌యంలో చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించారు.

దీంతో ఎక్క‌డిక‌క్క‌డ ఎమ్మెల్యేలు, ఇత‌ర నేత‌ల‌కు మ‌ధ్య వివాదాలు ఇప్పుడు రోడ్డున ప‌డ్డాయి. క‌దిరి నియోజ‌క‌వ‌ర్గంలో తలుపుల, ఎన్‌పీ కుంట మండలాల్లో వైసీపీ క్లీన్ స్వీపం చేసింది. అయితే.. ఎంతో క‌ష్ట‌ప‌డి సాదించిన ఈ ఫ‌లితాన్ని ఎంజాయ్ చేసే విష‌యంలో మాత్రం నాయ‌కులు ఆధిప‌త్య ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.  ఎంపీపీ ఎన్నిక సందర్భంగా స్థానిక నేతల్లో విభేదాలు తలెత్తాయి. ఎంపీపీ పదవి తమకంటే తమకంటూ వర్గాల మ‌ధ్య పోరు ప్రారంభ‌మైంది. తలుపుల ఎన్నికపై ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, ఆ పార్టీ సీఈసీ సభ్యుడు శ్రీనివాసులురెడ్డి పంతం ప‌ట్టారు.

త‌లుపుల మండలంలో 12 మంది ఎంపీటీసీ సభ్యులుండగా.. ఆరుగురు వైసీపీ సభ్యులు, ఇద్దరు టీడీపీ సభ్యులు శ్రీనివాసులురెడ్డి వైపు చేరారు. అయితే.. ఎమ్మెల్యే సిద్దారెడ్డి వ‌ర్గం నుంచి మహమ్మద్‌ రఫినాయక్ ఎంపీపీగా ఎన్నికైనట్లు అధికారులు ప్ర‌క‌టించారు. ఇది.. శ్రీనివాసుల రెడ్డికి ఆగ్ర‌హం తెప్పించింది. దీంతో ఆయ‌న త‌న వ‌ర్గం తో క‌లిసి .. హాల్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. దీనిపై సందిగ్థం నెల‌కొంది. ఇక‌, మడకశిర నియోజకవర్గంలోని అగళి మండలంలో మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఇక్క‌డ‌ ఎంపీటీసీగా గెలుపొందిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నజీర్‌సాబ్ ప‌రిస్థితి ఇబ్బందిలోకి జారిపోయింది. ఆయ‌న  ఎంపీపీ ఎన్నిక సంద‌ర్భంగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే.. అధికార పార్టీలోనే ఉన్న‌ప్ప‌టికీ.. ఆయన రాజీనామా ఆమోదం పొందలేదు. అయిన‌ప్ప‌టికీ.. కో-ఆప్టెడ్‌ మెంబర్‌గా నామినేషన్ వేశారు. కానీ, అధికారులు  మాత్రం ఈ నామినేషన్‌ తిరస్కరించారు. దీంతో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. అమలాపురం మండలంలో ఏకంగా ఎంపీపీ పదవికిముగ్గురు పోటీ ప‌డ్డారు. అందరూ వైసీపీ నాయ‌కులే కావ‌డం గ‌మ‌నార్హం.

వారి మ‌ధ్య ఏకాభిప్రాయం కుదిర్చేందుకు కొందరు ప్ర‌య‌త్నించినా.. అది ఫ‌లించ‌లేదు.  రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు ఎంపీపీ పదవి కూడా వైసీపీలో కుంప‌ట్లు రాజేసింది. బ‌ల‌మైన టీడీపీవ‌ర్గం ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో  వైసీపీ పాగా వేసినా.. ఆ ఆనందం మాత్రం నిలుపుకోలేక పోయారు. ఈ క్ర‌మంలో  ఆత్మకూరు ఎంపీటీసీ లీలావతి రాజీనామా చేశారు. ఇలా.. అనంత వైసీపీ రాజ‌కీయం వేడెక్క‌డం వెనుక‌. బాధ్య‌తులు చూస్తూ ఊరుకోవ‌డ‌మే రీజ‌న‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: