తాజాగా వెల్ల‌డైన‌.. ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ ఫ‌లితం.. అనేక మంది వైసీపీ నాయ‌కుల‌కు షాకిచ్చింది. పైకి వైసీపీ పూర్తిగా జ‌డ్పీటీసీ స్థానాలు గెలుచుకున్నా.. ఓటు బ్యాంకు.. విష‌యానికి వ‌స్తే.. టీడీపీ గ‌ట్టిపోటీ ఇచ్చింది. మ‌రీ ముఖ్యంగా టీడీపీ ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించిన త‌ర్వాత‌.. కూడా ఇంత రేంజ్‌లో వైసీపీకి ఓటు బ్యాంకు.. పోవ‌డం.. టీడీపీ ఓటు బ్యాంకు ప‌దిలంగా ఉండ‌డం వంటివి చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఉదాహ‌ర‌ణ‌కు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గాన్ని తీసుకుంటే.. ఇక్క‌డ జ‌డ్పీని వైసీపీ ద‌క్కించుకుంది.

అయితే.. ఓటు విష‌యానికి వ‌స్తే.. మాత్రం టీడీపీ గ‌ట్టిపోటీనే ఇచ్చింది. నిజానికి ఈ నియోజ‌క‌వ‌ర్గం ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకు కంచుకోట‌గా.. ఇటీవ‌ల ప్ర‌చారంలోక‌కి వ‌చ్చింది. వాస్త‌వానికి ఇది టీడీపీ కంచుకోట‌. గ‌తంలో   గుండ అప్ప‌ల సూర్య‌నారాయ‌ణ టీడీపీ త‌ర‌ఫున వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. అయితే.. 2004, 2009లో మాత్రం ధ‌ర్మాన ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. ఇక‌, 2014లో మ‌ళ్లీ గుండా స‌తీమ‌ణి.. ల‌క్ష్మి విజ‌యం ద‌క్కించుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ధ‌ర్మాన గెలిచారు. దీంతో ఇక‌పై త‌న‌దే ఇక్క‌డ హ‌వా అంటూ.. ప్ర‌సాద‌రావు త‌ర‌చుగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు.

దీనికి ప్ర‌ధాన కార‌ణం.. గుండా కుటుంబం వృద్ధులు ఉఅయిపోవ‌డమే. అప్ప‌ల సూర్య‌నారాయ‌ణ‌, లక్ష్మీదేవి ఇద్ద‌రూ కూడా వ‌యోవృద్ధులు కావ‌డం.. పార్టీ  త‌ర‌ఫున యువ‌నాయ‌కులు ఇక్క‌డ చ‌క్రం తిప్ప‌క‌పోవ‌డం.. వంటివి స‌హ‌జంగానే టీడీపీపై ఇలాంటి అంచ‌నాలే వ‌చ్చేలా చేసింది. కానీ, తాజాగా జ‌రిగిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో టీడీపీ హ‌వా క‌నిపించింది. నిజానికి పార్టీ ఈ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించ‌డంతో.. గుండా కుటుంబంసైలెంట్ అయిపోయింది. ఎక్క‌డా ప్ర‌చారం చేప‌ట్టలేదు. ఎవ‌రికీ రూపాయి కూడా ఇవ్వ‌లేదు. అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డ టీడీపీ బ‌ల‌మైన పోటీ ఇచ్చింది.

ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో జెడ్పీ స్థానం వైసీపీకి ద‌క్కినా.. కేవ‌లం 2800 ఓట్ల‌తోనే.. పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన అభ్య‌ర్థి గెలుపొందారు. ఒక‌, ఎంపీటీసీ స్థానాలు తీసుకున్నా.. మొత్తం 17 స్థానాల్లో.. ఏడుచోట్ల టీడీపీ అభ్య‌ర్థులు విజ‌యం ద‌క్కించుకున్నారు. వీరు తమంత‌ట తామే ప్ర‌చారం చేసుకున్నారు. సొంత నిధులే ఉన్నంత వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టుకున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఏడుస్థానాలు ద‌క్కించుకున్నారు.

సో.. దీనిని బ‌ట్టి.. ధ‌ర్మాన ప్ర‌భావం ఎంత‌నేది అర్ధ‌మవుతోంద‌ని అంటున్నారుప‌రిశీల‌కులు. టీడీపీ క‌నుక ప్ర‌త్య‌క్షంగా పోటీ చేసి ఉంటే.. ప‌రిస్థితి మ‌రో ర‌కంగా ఉండేద‌ని కూడా చెబుతున్నారు. ఏదేమైనా.. ఇప్పుడు ధ‌ర్మాన ఇలాకాలో.. టీడీపీ హ‌వా.. త‌గ్గ‌లేద‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంద‌ని విశ్లేష‌కులు సైతం చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: