ప్ర‌స్తుతం వైసీపీ ఎమ్మెల్యేల‌పై వ్య‌తిరేక‌త పెంచేందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌మ హ‌వా పెంచుకునేందుకు ప్ర‌భుత్వ విధానాల‌ను ఎండ‌గ‌డుతోంది. అయితే. కొన్ని చోట్ల ఇది వ‌ర్క‌వుట్ అవుతోంది. మ‌రికొన్ని చోట్ల విక‌టిస్తోంది. అయితే.. ఒక ఎమ్మెల్యేపై మాత్రం వ్య‌తిరేక‌తను ఎవ‌రూ పెంచాల్సిన అవ‌స‌రం లేద‌ని.. దానంత‌ట అదే పెరుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌నే గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి!

ఒకింత ఆశ్చ‌ర్యంగా ఉన్న‌ప్ప‌టికీ.. నిజ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి 2014లో కేవ‌లం 25 ఓట్ల మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకున్న ఆళ్ల.. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ పై ఓడిపోతార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆయ‌న వేల ఓట్ల మెజారిటీ తో గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఈ విజ‌యం ఇప్పుడు బీట‌లు ప‌డుతోంద‌ని అంటున్నారు. ఎందుకంటే.. స్థానికంగా.. జ‌రిగిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును ప్ర‌జ‌లు నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. ఈ నియోజ‌క‌ర్గం ప‌రిధిలోని దుగ్గిరాల మండ‌లంలో టీడీపీ 9 ఎంపీటీసీల‌ను ద‌క్కించుకుంది.

మొత్తం 17 ఎంపీటీసీల్లో.. 9 వ‌చ్చిన టీడీపీ ఎంపీపీని ఎన్నుకుని మండ‌లాన్ని ద‌క్కించుకునేందుకు ప్ర‌జ‌లు సామూహికంగా.. అంగీక‌రించిన‌ట్టేక‌దా! కానీ.. ప్ర‌జాతీర్పును సైతం ఎమ్మెల్యే ఆళ్ల  ప‌క్క‌న పెడుతున్నార‌ని అంటున్నారు స్థానికులు. ఎలా అంటే.. ఇక్క‌డ నుంచి గెలిచిన ఎంపీటీసీ అభ్య‌ర్థి బీసీ-ఈ కేట‌గిరిలోని ఆమెకు.. టీడీపీ ఎంపీపీ ప‌ద‌విని ఇచ్చేందుకు రెడీ అయింది. దీనికి సంబంధించి ఆమెకు త‌హ‌సీల్దార్ కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం ఇవ్వాల్సి ఉంది. దీనికిగాను ప్ర‌భుత్వ‌మే.. అన్ని జిల్లాల త‌హ‌సీల్దార్ల‌కు.. రాత్రి వ‌ర‌కు ఉండి.. ఎంపీపీ, జ‌డ్పీ అభ్య‌ర్థుల‌కు అవ‌స‌ర‌మైన అన్ని ప‌త్రాలు ఇవ్వ‌మ‌ని ఆదేశాలు ఇచ్చింది.

అయితే.. అధికారులు మాత్రం మూడు రోజులుగ‌డిచినా.. ఇక్క‌ట టీడీపీ ఎంపీపీ అభ్య‌ర్థికి మాత్రం కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం ఇవ్వ‌లేదు. పైగా.. త‌మ‌కు బ‌లం లేకున్నా.. కేవ‌లం ఎనిమిది మంది ఎంపీటీసీలే గెలిచినా.. ఎంపీపీ ప‌ద‌వి కోసం.. మండలాన్ని కైవ‌సం చేసుకునేందుకు ఎమ్మెల్యే ఆళ్ల పోలీసుల‌ను అడ్డు పెట్టుకుని రంగంలోకి దిగారు. అయితే.. కోరం లేక‌.. ఇది వాయిదా ప‌డింది. కానీ, ఈ విష‌యాన్ని ప్ర‌జ‌లు నిశితంగా గ‌మ‌నిస్తున్నారు.

ప్ర‌జాతీర్పు ను గౌర‌వించ‌ని.. ఎమ్మెల్యే అంటూ.. సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. సో.. ఇవ‌న్నీ .. గ‌మ‌నిస్తే.. ఆళ్ల త‌న‌కు తానే.. వ్య‌తిరేక‌త పెంచుకుంటున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గౌర‌వ ప్ర‌దంగా.. ఇక్క‌డ గెలిచిన టీడీపీకి మార్గం సుగ‌మం చేస్తే.. ఆయ‌న ప‌రువుతోపాటు ప్ర‌జ‌ల్లో కూడా ఆయ‌న‌కు మంచి మార్కులు ప‌డి ఉండేవ‌ని.. అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: