ఆయ‌న మాజీ మంత్రి. కానీ, సాధార‌ణ కార్య‌క‌ర్త‌లాగా ఆయ‌న దూకుడు చూపిస్తున్నారు. నిజానికి రాష్ట్ర రాజ కీయాల్లో ఆయ‌న సీనియ‌ర్‌. అయినా.. గ‌త ఎన్నిక‌ల్లో ఎదురైన పరాభ‌వంతో ఆయ‌న పుంజుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇది ఇప్పుడు వైసీపీకి ద‌డ పుట్టిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే దూకుడు ఈయ‌న కొన‌సాగితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. ఈ మాజీ మంత్రి విజ‌యం ఖాయ‌మ‌ని అంటున్నారు. విష‌యంలోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరు మాజీ ఎమ్మెల్యే  ఎన్. అమ‌ర్నాథ్ రెడ్డి.. ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్నారు. 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు.

అనంత‌రం.. చంద్ర‌బాబు చెంత‌కు చేరి... మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో.. టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి.. ఓడిపోయారు. అయితే.. అప్ప‌టి నుంచి ఆయ‌న దూకుడుగానేఉన్నారు. నియోజ‌క వ‌ర్గం ప‌రిధిలోని 5 మండ‌లాల్లోనూ ఆయ‌న చురుగ్గా ప‌ర్య‌టిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే వెంక‌ట్ గౌడ పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అదేస‌మ‌యంలో స్థానికంగా ఆయ‌న ఉండ‌ని తీరును కూడా ప్ర‌జ‌లకు వివ‌రిస్తున్నారు. ముఖ్యంగా స్థానికంగా కార్య‌క‌ర్త‌ల‌కు, నేత‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. వీటికితోడు.. పార్టీ ఇస్తున్న పిలుపు మేర‌కు ప్ర‌తి కార్య‌క్ర‌మాన్ని విజ‌యవంతం చేస్తున్నారు.

ఇటీవ‌ల చంద్ర‌బాబు ఇంటిపై జ‌రిగిన దాడికి నిర‌స‌న‌గా కూడా నియోజ‌క‌వ‌ర్గంలో కార్య‌క్ర‌మం నిర్వ‌హించా రు. అదేస‌మయంలో హుటాహుటిన వ‌చ్చి.. డీజీపీ కార్యాల‌యానికి వెళ్లి ఫిర్యాదు చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో ఈయ‌న‌పై కేసు కూడా న‌మోదు చేశారు. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ దూకుడుకు ఎక్క‌డిక క్క‌డ చెక్ పెడుతున్నారు. ఫ‌లితంగా మాజీ మంత్రి గ్రాఫ్ పెరిగింద‌ని.. టీడీపీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌సాగు తోంది.

ఇదిలావుంటే.. అమ‌ర్నాథ్‌రెడ్డి దూకుడు పెరుగుతున్న‌ట్టు గుర్తించిన ఎమ్మెల్యే వెంక‌ట గౌడ్ ఇటీవ‌ల కాలంలో పాద‌యాత్ర‌లు చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతున్నారు. సో.. మొత్తానికి మాజీ మంత్రి దూకుడు.. స‌క్సెస్ రేటు.. పెరిగిందనే అంచ‌నాలు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.  ఇక ఆయ‌న స్థానికంగా ఉండ‌డం లేద‌న్న టాక్ కూడా ఉంది. ఇవ‌న్నీ ఆయ‌న‌కు మైన‌స్ గా మారుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: