ఏపీలో నూతన రాజకీయ సమీకరణాలకు అడుగులు పడుతున్నాయా ? ఎన్నికలు లేకున్నా జగన్ సర్కార్ ను ఢీకొట్టేందుకు విపక్షాలు వేరు వేరుగా కూటములతో మూడేళ్ళ ముందుగానే ప్రారంభించాయా ? బీజేపీ లాగానే టీడీపీ కూడా నూతన రాజకీయ సమీకరణాలకు ఏపీలో నాంది పలకబోతోందా ?సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా బీజేపీ,జనసేన.టీడీపీ, వామపక్షాలు వ్యూహాత్మకంగా గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నాయా ? అస్సలు జగన్ సర్కార్ ను ఢీకొట్టడం కోసం ఏపీలో విపక్షాల వ్యూహం ఏంటి? అకస్మాత్తుగా తెరవెనుక ప్రయాణాల వెనుక ఉన్న స్కెచ్ ఏంటి ?
ఏపీలో రాజకీయంగా  రోజు రోజుకు జరుగుతున్న పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నాటి నుంచి జగన్ సర్కార్ డీ కొట్టేందుకు తెర వెనుక వ్యూహాలు రచిస్తున్న విపక్షాలు రోజుకో అంశాన్ని తెరపైకి తెచ్చి ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. జగన్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండున్నరేళ్లు పూర్తవుతున్న బలమైన పక్షాలుగా ఉన్న టీడీపీ,బీజేపీలు  ప్రజల్లోకి వెళ్లలేక ఇప్పటికి కింద మీద పడుతున్నాయి.2019 ఎన్నికల తరువాత టీడీపీ ఘోర ఓటమిని చవిచూస్తే బీజేపీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కకపోవడంతో   రెండేళ్ళుగా ఇరు పార్టీల పరిస్థితి రాష్ట్రంలో  అగమ్యగోచరంగా మారింది,దీనితో ఒంటరిగా అటు ప్రభుత్వంపై పోరాటం చెయ్యలేక ఇటు క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి  వెళ్లలేక  ఎవరికీ వారు  ఒంటరి పోరుతో నెట్టుకొస్తున్న ఇరు పార్టీల అధ్యక్షులు  జగన్ సర్కార్ ను ఢీకొట్టేందుకు తెర వెనుక రాజకీయంగా  వ్యూహాలు రచిస్తున్నారట.

 సార్వత్రిక ఎన్నికల్లో ఎవ్వరు ఊహించని విజయాన్ని నమోదు చేసిన జగన్ సర్కార్ డీ కొట్టేందుకు ముందుగానే బీజేపీ వ్యూహా త్మకంగా అడుగులు వేస్తోంది.జనసేనతో కలిసి పొత్తు  ప్రయాణం ప్రారంభించిన బీజేపీ మొదట ప్రభుత్వాన్ని కార్నర్ చెయ్యడంలో ఇద్దరు అధ్యక్షులు విఫలం అయినా వరుస భేటీల తరువాత కలిసి పోరాటం  చేసే అంశంలో ఉమ్మడి కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.గతంలో ఇరు పార్టీల మధ్య నెలకొన్న విభేదాలకు వివాదాలకు చెక్ పెట్టాలని అభిప్రాయానికి వచ్చిన ఇద్దరు అధ్యక్షులు ప్రజల్లోకి వెళ్లేలా వినూత్నమైన కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.ఏపీలో బలమైన శక్తిగా ఉన్న జగన్ సర్కార్ ను  ఢీకొట్టడం కోసం ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై  ఎవరికీ వారు ఒంటరిగా పోరాటం చెయ్యడంతో పాటు కలిసి పోరాటం చెయ్యాలని అందుకు అవసరం అయితే  ప్రభుత్వ వైఫల్యాల విషయంలో  కలిసి వచ్చే అన్ని సంఘాలను, సంస్థలను,పార్టీలను కలుపుకోవాలని బీజేపీ,జనసేన ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేకపోయినా వైసీపీ లాంటి బలమైన శక్తిని ఎదుర్కోవాలంటే ఇప్పటి నుంచి తెర వెనుక వ్యూహాలు రచించాలని ఇరు పార్టీలు అంగీకారానికి వచ్చాయట.


మరోవైపు బలమైన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ మొదట ఒంటరి  పోరు చేసిన గత కొంత కాలంగా జగన్ సర్కార్ ను  డీ  కొట్టేందుకు అనుసరిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ నడుస్తోంది.సమయం దొరికినప్పుడల్లా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న అధినేత,యువనేతలు కలిసి వస్తున్న అన్ని పక్షాలతో అడుగులు వేయడం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీజేపీతో తెగ దెంపులు చేసుకున్నాక అంటి ముట్టనట్లు ఉన్న చంద్రబాబు గత కొంత కాలంగా  ఏపీలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంలతో కలిసి జత కట్టి ప్రభుత్వంపై పోరాటం చెయ్యడం కొత్త సమీకరణాలపై రాజకీయగా చర్చ నడుస్తోంది.ఇప్పటికే టీడీపీ అంతర్గత సమావేశాల్లోనూ కలిసి వచ్చే అన్ని పక్షాలతో కలిసి  పోరాటం చెయ్యాలని చంద్రబాబు క్యాడర్ కు సూచించినట్లు తెలుస్తోంది.ఇప్పటికే అనేక సమస్యలపై కలిసి పోరాటం చేసిన చేసిన నాలుగు పార్టీలు ఇప్పుడు భవిష్యత్ లో కూడా కలిసి ఇదే విధంగా అడుగులు వేస్తారనే చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతోంది.అమరావతి, జాబ్ క్యాలెండర్, మహిళలపై దాడులు,స్టీల్ ప్లాంట్  లాంటి అంశాలను ఉమ్మడిగా చేపడుతున్న వేళా రాబోయే రోజుల్లో ఇదే దిశగా అడుగులు పడతాయని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.మొత్తానికి జగన్ సర్కార్ డీ కొట్టేందుకు విపక్షాలు కూటములను సిద్ధం చేస్తున్నాయి.చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ ప్రయత్నాలు ఈమేరకు ఫలిస్తాయో

మరింత సమాచారం తెలుసుకోండి: