విజ‌య‌వాడ ఎంపీ.. టీడీపీ నాయ‌కుడు.. కేశినేని శ్రీనివాస్‌.. రాజ‌కీయాల‌కు ముగింపు ప‌లుకుతున్నారా?  వ చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న రంగంలోకి దిగ‌డం లేదా?  ఇప్ప‌టికే పార్టీకి దూరం మెయింటెన్ చేస్తున్నారా? అం టే.. ఔన‌నే అంటున్నారు విజ‌య‌వాడ పార్టీ నాయ‌కులు. ఆది నుంచి ఫైర్ బ్రాండ్ నాయకుడిగా చెల‌రేగి న‌.. నాని.. విజ‌య‌వాడ టీడీపీలో స‌రికొత్త ట్రెండ్ సృష్టించేందుకు రెడీ అయ్యారు. ఈ క్ర‌మంలో అప్ప‌టి ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌, ఎమ్మెల్యే బొండా ల‌తో ప్ర‌త్యేక వ‌ర్గాలు ఏర్పాటు చేసుకుని.. హ‌ల్‌చ‌ల్ చేశారు. కానీ, గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఎంపీకి వీరంతా దూర‌మ‌య్యారు., ఆయ‌న ఒంటెత్తు పోక‌డ‌ల‌తోనే తాము దూర‌మ‌య్యామ‌ని.. వారు బ‌హిరంగంగా చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మేయ‌ర్ పీఠం విష‌యం కూడాప్ర‌స్తుత ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్, మాజీ ఎమ్మెల్యే బొండా, ఎంపీ నానిల మ‌ధ్య చిచ్చు పెట్టింది. మాకు కావాలంటే.. మాకు కావాల‌ని.. వారు ప‌ట్టుబ‌ట్టారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు.. ఈ పీఠాన్ని ఎన్నిక‌ల‌కు ముందుకు నాని కుమార్తె శ్వేత‌కు ఖ‌రారు చేశారు. దీంతో వారు నానికి దూర‌మ‌య్యారు. ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పార్టీని గెలిపిస్తానంటూ.. మిగిలిన నేత‌ల‌పై ఎంపీ నాని విరుచుకుప‌డ్డారు. త‌న వ‌ల్లే పార్టీ ఉంద‌ని చెప్పుకొచ్చారు. ఇవి.. ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ బ‌ల‌హీన ప‌రిచాయి.

అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు నానికే మ‌ద్ద‌తు తెలిపారు. పోనీ.. ఎన్నిక‌ల్లో స‌త్తా చాటారా? అంటే.. టీడీపీ ఘోరంగా ప‌రాజ‌యం పాలైంది. దీంతో పార్టీ అధిష్టానం.. నానిని ప‌క్క‌న పెట్టింది. మ‌రోవైపు.. మిగిలిన నేత‌లు కూడా ఎంపీకి చాలా దూర‌మ‌య్యారు. ఇప్పుడు ఎవ‌రికివారు దూకుడుగా ఉన్నారు. ఈ క్ర‌మంలో నానికి మ‌ద్ద‌తు పూర్తిగా క‌రువైంద‌నే అంటున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కొంత త‌గ్గితే బెట‌ర్ అని అధిష్టానం నుంచి సూచ‌న‌లు వ‌చ్చాయి. అయితే.. ఆయ‌న మాత్రం త‌న పంథాను మార్చుకోక‌పోగా.. టీడీపీలో ఉన్న వారంతా దొంగలేన‌ని.. ఆఫ్ దిరికార్డుగా చేస్తున్న వ్యాఖ్య‌లు మ‌రింత మంట‌లు రాజేస్తున్నాయి.

పైగా.. ఇటీవ‌ల‌.. నాని.. చంద్ర‌బాబు ఇంటిపై జ‌రిగినదాడి విష‌యంలో క‌నీసం స్పందించ‌లేదు. మిగిలిన విజ‌యవాడ నాయ‌కులు అంద‌రూ చంద్ర‌బాబును ప‌రామ‌ర్శించారు. ప్ర‌భుత్వంపై దుమ్మెత్తిపోశారు. డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లి కేసులు పెట్టించుకున్నారు. కానీ, నాని మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. సో.. దీనిని బ‌ట్టి.. ఆయ‌న ఇక‌, రాజ‌కీయాల‌కు దూరం అవుతార‌ని అంటున్నారు ఆయ‌న అనుచ‌రులు. మ‌రోవైపు. బీజేపీలోకి వెళ్లే ప్ర‌య‌త్నం కొన్నాళ్ల కింద‌ట చేసినా.. అది కూడా ఫ‌లించ‌లేదు. సో.. మొత్తానికి ఆయ‌న పార్టీ నుంచే కాకుండా.. రాజ‌కీయాల నుంచి కూడా త‌ప్పుకొంటారు వార్త‌లు విజ‌య‌వాడ‌లో హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: