సాధార‌ణంగా.. స్వాములు.. పీఠాధిప‌తులు.. మ‌ఠాధిప‌తులు.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటారు. ఒక‌వేళ ఉన్నా.. నేత‌ల‌తో ట‌చ్‌లో మాత్ర‌మే ఉంటారు. నేరుగా రాజ‌కీయాల్లోకి దిగ‌రు. ఒక వేళ దిగినా.. నేరుగా మైకు ప‌ట్టుకుని.. రోడ్డెక్క‌రు. కానీ, ఏపీలోని కాకినాడ శ్రీపీఠాధిప‌తి.. ప‌రిపూర్ణానంద స్వామి మాత్రం.. నేరుగా కాషా యంపై కాషాయం క‌ప్పుకొని .. రాజ‌కీయాల్లోకి దిగిపోయారు. ఏపీని కాద‌ని.. తెలంగాణ‌లో చ‌క్రం తిప్పేందుకు రెడీ అయ్యారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డి ప్ర‌భుత్వం, బ‌ల‌మైన నాయ‌కుడు కేసీఆర్‌ను ఓడించి తీరుతామ‌ని శ‌ప‌థం చేశారు.

బీజేపీని అధికారంలోకి తీసుకువ‌స్తామ‌ని.. సీనియ‌ర్ల‌కంటే.. దూకుడుగా ముందుకు సాగారు స్వామి. అంతేకా దు.. టీవీ పొలిటిక‌ల్ డిబేట్ల‌లోనూ.. ఆయన పార్టిసిపేట్ చేశారు. త‌న వాక్చాతుర్యం.. వాడి వేడైన వ్యాఖ్య‌ల‌తో పాలిటిక్స్‌ను వేడి పుట్టించారు. ఈక్ర‌మంలోనే బీజేపీ అధిష్టానం కూడా ఆయ‌న‌కు ప్రాధాన్యం ఇచ్చింది. ప్ర‌త్యేకంగా మందీ మార్బ‌లాన్ని కూడా ఏర్పాటు చేసింది. దీంతో కొన్ని రోజులు హైద‌రాబాద్ స‌హా.. తెలంగా ణ‌లోని కొన్ని జిల్లాల్లో స్వామి ప‌రిపూర్ణానంద హ‌ల్ చ‌ల్ చేశారు. అయితే.. ఆయ‌న వ్యూహాలు ఎవ‌రికీ అర్ధం కాలేదు. పైగా ఆయ‌న‌పై ఏపీ వాసి అనే ముద్ర ఉంది.

ఈ ముద్ర‌ను తుడిపేసుకునేందుకు ప‌రిపూర్ణానంద చేసిన ప్ర‌య‌త్నం కూడా ఫ‌లించ‌లేదు. ఇక‌, తెలంగాణ లో మ‌ళ్లీ కేసీఆర్ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చింది. ఇదిలావుంటే..అసలు రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్నా రంటూ.. హైద‌రాబాద్ పోలీసులు మూడు నెల‌ల పాటు స్వామిపై బ‌హిష్క‌ర‌ణ ఆదేశాలు ఇచ్చారు. ఇక‌, అప్ప‌టి నుంచి స్వామిని ప‌ట్టించుకున్న వారు క‌నిపించ‌డం లేదు. అంతేకాదు.. మునుపు ఉన్న హ‌వా.. దూకుడు ఇప్పుడు ఆయ‌న‌లో క‌నిపించ‌డంలేదు.

నిజానికి స్వామి అవ‌సరం ఉన్న‌ప్ప‌టికీ.. బీజేపీలో ఎందుకో.. ఆయ‌న‌కంటూ.. నాయ‌కుల‌ను నిల‌బెట్టుకోలేక పోయారు. ఎవ‌రినీ ఆక‌ర్షించ‌క‌లేక పోయారు. దీంతో ఇప్పుడు కాకినాడ పీఠానికే ప‌రిమిత‌మ‌య్యార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి అంతే.. ఎక్క‌డ ఉండాల్సిన వారు అక్క‌డ ఉంటేనే గౌర‌వం.. మ‌ర్యాద‌.. అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: