తాలిబన్ లు ఆఫ్ఘన్ ఆక్రమణ చేసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో ప్రపంచం ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్న రాక్షసులు నేతలుగా ఉండటం కూడా చూశాం. వాళ్ళు గతంలోని తాలిబన్ ప్రభుత్వంలో పనిచేసిన లేదా వారి వారసులే అవటంతో రానున్న రోజులలో వల్ల పాలన ఎలా ఉండబోతుంది అనేది స్పస్టం అవుతుంది. ఈ తాలిబన్ కేబినెట్ చూసిన తరువాతే ప్రపంచానికి వాళ్ళ పాలన ఎలా ఉంటుందో ఒక స్పస్టత వచ్చింది. అందుకే వాళ్ళను గుర్తించడంలో కాస్త వెనకా ముందు ఆలోచిస్తున్నారు. ఈ కేబినెట్ కాస్త ఆలస్యంగా ఏర్పాటు చేసి ఉంటే గుర్తింపు ముందుగానే వచ్చేసేది. తాలిబన్ లు చేసిన తప్పు అది. తాము మారుతున్నాం అని చెబుతున్నారు తప్ప ఆ దిశగా ఒక్క అంశం కూడా  కనిపించకపోవడం కూడా ప్రపంచదేశాలకు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అందుకే ఆచితూచి ప్రవర్తిస్తున్నాయి ఆయా దేశాలు. గతంలో షరియా చట్టాలు ఎంత కటినంగా అమలు చేశారో అదే ఇప్పుడూ అనుసరిస్తామని కూడా కేబినెట్ చెబుతుండటం వాళ్ళలో మార్పు రాదని తెలియజేస్తుంది.

ఇంకా గుర్తింపు లేకపోయినా అప్పుడే భారత్ లో చొరబాట్లు చురుగ్గా సాగుతూనే ఉన్నాయి. అందుకే నిఘా సంస్థలు కూడా భారత్ ను ఎప్పటికప్పుడు ఉగ్ర ముప్పు గురించి హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఈ నేపద్యంలోనే ఢిల్లీ లో ఆరుగురిని అదికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వీరందరూ పాక్ లో ఉగ్ర సంస్థల నుండి తర్ఫీదు పొందినట్టు అదికారులు స్పస్టం చేసిన విషయం కూడా చూశాం. అంటే ఒక్కసారి తాలిబన్ దేశం ఏర్పాటు చేయగానే భారత్ లో పాక్ తన స్లీపర్ సెల్స్  ను యాక్టివ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసమే పాక్ చైనా కలిసి ఆఫ్ఘన్ ను ఆక్రమించుకున్నట్టు అందరికీ తెలిసిన విషయమే. కనీసం గుర్తింపు లేని సమయంలోనే తాలిబన్ లు ఇలా చేస్తుంటే, ఇక గుర్తింపు వస్తే ప్రపంచానికి ఉగ్ర ముప్పు ఎలా ఉండబోతుందో అర్దం చేసుకోవచ్చు.

వీళ్ళ టార్గెట్ భారత్ అయినప్పటికీ దానిని సరాసరి సాదించలేక ఆఫ్ఘన్ ను నాశనం చేసైనా తమ ప్రణాళికలు అమలుచేయాలని నిర్ణయించుకుంది. దొంగ దెబ్బలు కొట్టడం వలన భారత్ ను నిలువరించి తమకు అడ్డు తొలగించుకోవాలని చైనా చూస్తుంది. అందుకే భారత్ అంటేనే రగిలిపోతున్న పాక్ తో జాతకట్టింది. ఈ రెండు దేశాలు కలిసి భారత్ పై రాబోయే రోజులలో అనేక ఉగ్ర కుట్రలు చేయనున్నట్టు తెలుస్తుంది. కేవలం ఒక దేశ అబివృద్దిని చూసి ఓర్వలేక రెండు దేశాలు కలిసి ఒక దేశాన్ని నాశనం చేసి మరీ భారత్ పై పగ తీర్చుకోవడానికి సిద్దపడ్డాయి. అంటే భారత్ కు రాబోయే కాలం అంతా ఉగ్ర దాడికి అడుగు దూరం ఉన్నట్టే అనేది మాత్రం స్పస్టం అవుతుంది. దీనిని భారత్ కూడా గ్రహించింది కాబట్టే ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూ ఉగ్ర కుట్రలను ఎక్కడికి అక్కడ నిలువరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: