గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ తరలింపు పై హైకోర్టు ను పండ్ల వ్యాపారులు ఆశ్రయించారు. ఈ నెల 25 నుండి మార్కెట్ క్లోజ్ చేస్తునట్టు ప్రకటించిన అధికారులు... ఖాళీ చేయాలని సూచనలు కూడా చేసారు. కొహెడ లో నూతన మార్కెట్ నిర్మాణం చేసే వరకు బాట సింగారం లో తాత్కాలిక మార్కెట్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇప్పుడు ఉన్న మార్కెట్ స్థలం లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మణo చేయనున్నట్టు స్పష్టం చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది తెలంగాణా ప్రభుత్వం. పండ్ల వ్యాపారులు ఖాళీ చేసేందుకు నెల రోజుల గడువు ప్రభుత్వం ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పటికిప్పుడు మార్కెట్ నుండి ఖాళీ చేయలేం అని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ చేసేందుకు ఈ నెల  30  వరకు సమయం ఉన్నా సరే 25 నుండే మార్కెట్ క్లోజ్ చేస్తునట్టు అధికారుల నుంచి ప్రకటన రావడం వివాదాస్పదం అయింది. ఇతర రాష్ట్రాల నుండి పండ్లు వస్తున్న సమయంలో ఇప్పుడు మార్కెట్ మూసివేత ప్రకటన పై హై కోర్టు ను స్థానిక వ్యాపారులు ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరారు. తాత్కాలిక మార్కెట్ లో కోల్డ్  స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తామని హైకోర్టు కు  రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.

తదుపరి విచారణ సెప్టెంబర్ 30 కు వాయిదా వేసింది తెలంగాణా హైకోర్ట్. రేపు బాటసింగారం కి ఫ్రూట్ మార్కెట్ తరలించడానికి అధికారుల ఏర్పాట్లు పూర్తి కూడా చేసారు. ఇవాళ రాత్రి లోపు మార్కెట్ ను ఖాళీ చేయాలని మార్కెట్ కమిటీ ఆదేశాలు ఇవ్వడం వివాదాస్పదం అయింది. బాటసింగారం లో కనీస సదుపాయాలు లేవంటూ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ ను ఖాళీ చేసే ప్రసక్తే లేదని వ్యాపారులు స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: