ఏపీలో డ్రగ్స్ వ్యవహారంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఏ అంశం పై అయినా టీడీపీ గాలి మాటలు మాట్లాడదు....అన్ని సాక్షాధారాలతో టీడీపీ మాట్లాడుతుంది అనేది డీజీపీ  గుర్తు పెట్టుకోవాలి అని ఆయన హితవు పలికారు. ఏపీలో డ్రగ్స్ మాఫియా నడుస్తుంది అని ఈ సందర్భంగా కామెంట్ చేసారు. ఏపీలో పోలీసు శాఖ ఎవరి కోసం పని చేస్తుంది అని ఎంపీ నిలదీశారు. టీడీపీ ని మాట్లాడద్దు అని చెప్పడానికి డీజీపీ ఎవరు అని ఆయన నిలదీశారు. డ్రగ్స్ వెనుక ఎవరు ఉన్నారో తేల్చమంటే డీజీపీ ... సీఎం జగన్ యువతకు హెరాయిన్ సప్లై చేస్తున్నారు అని ఆరోపించారు.

డీజీపీ,ఎస్పీ లు,కమిషనర్ లు ప్రభుత్వాన్ని వెనకేసుకుని వస్తే ప్రతిపక్షానికి పోలీసు వ్యవస్థపై నమ్మకం ఎలా కలుగుతుంది అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ఖాకి డ్రెస్ వేసుకుని పబ్లిక్ కి సేవ చేయాలి కానీ పార్టీలకు కాదు అని అన్నారు. హెరాయిన్ అంశం లో ఈ వే బిల్లులు బయటకు తీయాలని అన్నారు. జగన్ వి అన్ని క్రిమినల్ ఐడియాలు అని ఆయన మండిపడ్డారు. హైరాయిన్ సుధాకర్ సొంత ఊరు ద్వారపూడి...అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కి ఏమైనా లింక్ ఉందా అనేది విచారించాలి అంటూ ఆయన డిమాండ్ లు చేసారు.

జగన్ చెప్పిన ప్రత్యేక హోదా ఎక్కడ ఉంది అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆశీ కంపెని విజయవాడలతో జీఎస్తీ రిజిస్టర్ చేసుకొని వ్యాపారం చేస్తున్నారు అని అన్నారు. ఆశీ  కంపెనీ గత సంవత్సరంలో కూడా ఫైల్ చేశారు  అని అన్నారు. రాష్ట్ర సమస్యల పై కేంద్ర తో పోరాటం చెయ్యాలి కానీ మీరు తాడేపల్లి ప్యాలస్ కె పరిమితం అవుతున్నారు అని విమర్శించారు. డ్రగ్స్ మేము రాజకీయం చేయడం లేదు..మాకు రాష్ట్ర భవిష్యత్ ముఖ్యం అని ఆయన స్పష్టం చేసారు. రాష్ట్రంలోకి  డ్రగ్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి... ఇక్కడ నుంచి బ్లాక్ మనీ ఎక్సపోర్టు అవుతుంది అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: