ఏపీలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ఒకటి అనుకుంటే మరొకటి జరిగిన‌ట్టే క‌నిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల‌లో ఆ పార్టీ చ‌రిత్ర‌లోనూ ఎప్పుడూ లేనంత ఘోరంగా ఓడిపోయింది. ఇంకా చెప్పాలంటే పార్టీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు దూరమయింది. బీసీలు గత ఎన్నికల్లో జగన్ వైపు చూడ‌డంతో తిరిగి బీసీలను తనవైపునకు తిప్పుకునేందుకు చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తూ వారిని మ‌చ్చిక చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే వారికి ప‌లు ప‌ద‌వులు ఇస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను బీసీ వర్గాలకు చెందిన వారినే ఎక్కువగా నియమించిన ప‌రిస్థితి ఉంది. అయితే వారు పేరుకు మాత్ర‌మే ప‌ద‌వుల్లో ఉన్నా వారు డ‌మ్మీలు అయిపోతున్నార‌ట‌.

ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు బీసీల‌ను ఆక‌ట్టు కునేందుకు మ‌రో అడుగు ముందుకు వేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చంద్రబాబు అచ్చెన్నాయుడిని నియమించారు. పార్లమెంటరీ ఇన్ ఛార్జులకు కూడా బీసీ వ‌ర్గాల‌కు చెందిన వారికే ఎక్కువ అవ‌కాశం ఇచ్చారు. తాను తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని చంద్రబాబు అనుకున్నారు.  పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ ఛార్జులను నేతలు పెద్దగా పట్టించుకోవడం లేద‌ని.. వీరిని పార్టీ నేత‌లు లైట్ తీస్కొంటున్నార‌న్న విమ‌ర్శ‌లు తీవ్రంగా వ‌స్తున్నాయి.

దీంతో పార్ల‌మెంట‌రీ పార్టీ జిల్లాల అధ్య‌క్షుల్లో నిరాశ వ‌చ్చేసింది. వారిలో కొంద‌రు అయితే త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసేందుకు కూడా రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఉదాహ‌ర‌ణ‌క ఒంగోలు విష‌యానికి వ‌స్తే ఈ పార్ల‌మెంట‌రీ జిల్లా అధ్య‌క్ష ప‌ద‌విని బీసీ వ‌ర్గానికి చెందిన నూక‌సాని బాలాజీకి ఇచ్చారు. అయితే బాలాజీకి టీడీపీ నేతలు సహకరించడం లేద‌న్న టాక్ ఉంది. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఒంగోలు - కొండెపి - మార్కాపురం - యర్రగొండపాలెం - గిద్దలూరు - కనిగిరి - దర్శి నియోజకవర్గాలున్నాయి. ఇందులో ఒక్క కొండపి నియోజవర్గంలో మాత్ర‌మే టీడీపీ ఎమ్మెల్యేలున్నారు.

ఆయ‌న పెట్టిన స‌మావేశాల‌కు ఎవ్వ‌రూ వెల్ల‌డం లేద‌ట‌. అస‌లు ఇన్ చార్జ్‌లు కూడా ఆయ‌న‌ను ప‌ట్టించు కోవ‌డం లేదంటున్నారు. విశాఖ పార్ల‌మెంట‌రీ జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న ప‌ల్లా శ్రీనివాస్‌కు కూడా ఇదే అవ‌మానాలు ఎదురవుతున్నాయంటున్నారు. మ‌రి ప‌ద‌వులు ఇచ్చి ఈ నేత‌ల‌ను డ‌మ్మీల‌ను చేయ‌డం ఎందుకో వాళ్ల‌కే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: