తాలిబన్ లకు సాయం అందించి మరీ ఆఫ్ఘన్ ఆక్రమణ చేయించిన పాకిస్తాన్, చైనా దేశాలు ఇటీవల భారత్ పై చీటికిమాటికి విమర్శలు చేస్తుండటం చూస్తున్నాం. పాకిస్తాన్ కాశ్మీర్ లో మానవహక్కులకు భంగం కలుగుతుందని ఐక్యరాజ్య సమితికి లేఖ రాసింది. ఇక చైనా లడ్డాఖ్ లో భారత్ చొరబాటుకు ప్రయత్నిస్తుందంటూ కొత్త పాట ప్రారంభించింది. ఈ రెండు సిగ్గులేకుండా ప్రపంచం ముందు పతివ్రతల లా ప్రవర్తిస్తుండటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు ఆ రెండు దేశాలు తప్పులు చేస్తూ అవి భారత్ చేస్తున్నట్టు ప్రపంచం ముందు షో చేయడం తోనే ఆరెండు దేశాల దుర్మార్గపు ఆలోచనలు తెలుస్తూనే ఉన్నాయి.

ఆఫ్ఘన్ విషయంలో ప్రపంచం అక్కడ ప్రజల సాధకబాధకాలు గురించి ఆందోళన పడుతుంటే ఈ  రెండు దేశాలు మాత్రం తాలిబన్ లను గుర్తించాలని ప్రపంచానికి హెచ్చరికలు జారీచేయడం హాస్యాస్పదం. తాము స్వయంగా తీవ్రవాదులకు సాయం చేస్తూ ప్రపంచాన్ని కూడా అదే పని చేయమని అడగటానికి కాస్తైనా సిగ్గుపడకుండా ప్రవర్తిస్తున్నాయి. కేవలం భారత్ ముందుకు పోతుందనే అక్కసుతో ఆఫ్ఘన్ ప్రజలు ఏమైపోయినా పరవాలేదు అని తాలిబన్ లకు సాయం చేసిన దుర్మార్గులను కూడా ఉపేక్షించకుండా తగిన చర్యలు తీసుకుంటే బాగుండేదని పలువురు ఆశిస్తున్నారు.

భారత్ పై ఏదో ఒక నిందారోపణ చేయడం ఈ రెండు దేశాలకు ఒక పనిగా పెట్టుకున్నాయి. తాజాగా దీనిపై ఐక్యరాజ్య సమితి లో భారత ప్రతినిధి స్పందించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కాశ్మీర్, లడ్డాఖ్ లు భారత్ లో భాగంగా ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఉగ్ర భూతాలను పెంచిపోషిస్తుందని ప్రపంచం బాహాటంగానే ఒప్పుకుంటుందని గుర్తుచేశారు.  ఐరాస సహా పలు దేశాల నిఘా సంస్థలు వెతుకుతున్న తీవ్రవాదులందరు పాకిస్తాన్ లోనే ఉన్నారని ఆమె అన్నారు. బిన్ లాడెన్ కు కూడా పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చిందని, ఇంకా పాకిస్తాన్ లో ఉన్నాడని భారత్ నమ్ముతుందన్నారు. ఈ విషయాలకు సమాధానం చెప్పి తరువాత మిగిలిన విషయాలు చర్చించాలని ఆమె పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: