పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో చ‌రిత్ర‌లోనే లేనంత ఘోరంగా ఓడిపోవ‌డంతో టీడీపీకి ఇప్పుడు చుక్క‌లు క‌న‌ప‌డుతున్నారు. పైగా చంద్ర‌బాబు వ‌య‌స్సు ఇప్ప‌టికే పై బ‌డింది. లోకేష్ సామ‌ర్థ్యంపై పార్టీ నేత‌ల్లో ఇప్ప‌ట‌కీ చాలా మందికి గురి కుద‌ర‌డం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో నెగ్గుకు రావడం చంద్రబాబుకు అంత సులువు కాదు. ఇంకా చాలా జిల్లా ల‌లో .. చాలా నియోజ‌క‌వ‌ర్గాల లో వృద్ధ నేత‌లు, అవుట్ డేటెడ్ లీడ‌ర్లే చ‌క్రం తిప్పుతున్నారు. వీళ్ల తో పాటు వీరి వార‌సులు సైతం గ‌త ఎన్నిక‌ల‌లో ఘోరంగా ఓడిపోయారు. సోమిరెడ్డి స‌ర్వేప‌ల్లి తో పాటు ఓ సారి కోవూరు లో క‌లుపుకుంటే మొత్తంగా ఐదు సార్లు ఓడిపోయారు. ఇంకా చంద్ర‌బాబు ఆయ‌న్ను ఎందుకు భ‌రిస్తున్నారో ?  కూడా అర్థం కాని ప‌రిస్థితి.

ఇక తునిలో య‌న‌మ‌ల ఫ్యామిలీని ప్ర‌జ‌లు ఎప్పుడో 20 ఏళ్ల క్రిత‌మే తిర‌స్క‌రించే శారు. అస‌లు వాళ్లు పోటీ చేస్తే వ‌చ్చే ఎన్నిక‌ల‌లో డిపాజిట్లు కూడా వ‌చ్చే ప‌రిస్థితి లేదు. అయినా వాళ్ల‌ను బాబు ఎందుకు భ‌రిస్తున్నారో ?  తెలియ‌దు. మైదుకూరులో రెండు సార్లు ఓడిన పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ ను కూడా అలాగే భ‌రిస్తున్నారు. దీంతో పాటు మాచ‌ర్ల‌లో జ‌నాలు మ‌ర్చిపోయిన అవుట్ డేటెడ్ లీడ‌ర్‌కు పార్టీ బాధ్య‌త‌లు ఇచ్చారు. అదే గుంటూరు జిల్లాలోని ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గానికి ఓసీ వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి మాకినేని పెద‌ర‌త్త‌య్య‌కు పార్టీ ప‌గ్గాలు ఇచ్చారు.

అస‌లు ర‌త్త‌య్య‌కు ఎందుకు పార్టీ ప‌గ్గాలు ఇచ్చారో తెలియ‌క పార్టీ నేత‌లే త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. చాలా మంది అవుట్ డేటెడ్ నేత‌ల‌కు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వక తప్పని పరిస్థితి. వైసీపీని తట్టుకోవాలంటే ఆర్థికంగా నిలబడాలంటే యువ నేత‌ల‌తో పాటు ఛ‌రిష్మా ఉన్న నేత‌లు పార్టీకి అవ‌స‌రం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 నియోజకవర్గాలుంటే వీటిలో 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌ట‌కీ పాత నేత‌లు, మాజీ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరిలో చాలా మంది యాక్టివ్ గా ఉండ‌డం లేదు. మ‌రి బాబు ఈ పాత త‌రం ఆలోచ‌న‌ల‌తోనే వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళితే ఆ ఎన్నిక‌ల లోనూ ఘోరంగా ఓడిపోక త‌ప్ప‌దు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: