ఇటీవ‌ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న నియోజ‌వ‌ర్గానికి వ‌చ్చి త‌న‌కు రేవంత్ స‌మాచారం ఇవ్వ‌క‌పోవ‌డంపై జ‌గ్గారెడ్డి మీడియా మందుకు వ‌చ్చి ఫైర్ అయ్యారు. జ‌గ్గారెడ్డి రేవంత్ తో పాటూ పార్టీని కూడా ఇందులోకి లాగారు. కాంగ్రెస్ పార్టీనా ప్రైవేట్ లిమిటెడ్ పార్టీనా అంటూ సంచ‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీలో త‌న‌కు గౌర‌వం లేదంటూ జగ్గారెడ్డి ఆగ్ర‌హానికి గుర‌య్యారు. అస‌లు పార్టీలో ఏం జ‌రుగుతుంది...ప్ర‌శ్నిస్తే సోష‌ల్ మీడియాలో అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని జ‌గ్గారెడ్డి మండి ప‌డ్డారు. నాకు కూడా అభిమానులు ఉన్నారు రాజ‌కీయాల్లో హీరోయిజం ప‌నిచేయ‌దంటూ రేవంత్ రెడ్డిని అన్నారు.  

జ‌గ్గారెడ్డి చేసిన ఆ వ్యాఖ్య‌ల‌తో టీ కాంగ్రెస్ లో ఒక్క‌సారిగా ప్ర‌కంప‌న‌లు రేగాయి. అయితే తాజాగా అదిష్టానం జ‌గ్గారెడ్డిని బుజ్జ‌గించి న‌చ్చ‌జెప్పింది. దాంతో తాజాగా ఆయ‌న త‌ప్పు త‌న‌దే అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జగ్గారెడ్డి కి ఏఐసీసీ ఇంచార్జి కార్య దర్శలు  శ్రీనివాస్ కృష్ణన్, బోసురాజు స‌ర్దిచెప్పారు. కాగా జ‌గ్గారెడ్డి మాట్లాడుతూ...నిన్న జ‌రిగిన‌ ఘటన ను అంతా మ‌ర్చిపోవాల‌ని అన్నారు. అంతర్గత విషయాలను మీడియా ముందు మాట్లాడటం పై జగ్గారెడ్డి స్వారీ చెప్పేశారు. అంతర్గత విషయాలు బయట మాట్లాడటం త‌న‌ తప్పే అని జ‌గ్గారెడ్డి ఒప్పుకున్నారు.

త‌న‌ వైపు నుండే తప్పు జరిగిందని..మరోసారి అలా జరగదని వివరణ ఇచ్చాన‌ని జ‌గ్గారెడ్డి తెలిపారు. మీడియా ముందు మాట్లాడ‌వ‌ద్ద‌ని ఠాగూర్, బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్ త‌న‌కు సూచనలు చేశారని జ‌గ్గారెడ్డి వెల్ల‌డించారు. త‌మ‌ది అన్నదమ్ముల పంచాయితీ లాంటిదని జ‌గ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కేడర్ ఎవరూ కూడా కన్ఫ్యూజ్ కావద్ద‌ని జ‌గ్గారెడ్డి వెల్ల‌డించారు. అంతే కాంకుడా తాను  సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ ల డైరెక్షన్ లో పనిచేస్తాన‌ని చెప్పారు. త‌మ‌ యుద్ధం టిఆర్ఎస్, బీజేపీ మీదేన‌ని జ‌గ్గారెడ్డి స్ప‌ష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: