ఏపీలో 2019 ఎన్నిక ల‌లో జ‌గ‌న్ అధికారం లోకి రావ‌డానికి అనేక ఫ్యాక్ట‌ర్స్ బాగా ప‌ని చేశాయి. ఈ లిస్టులోనే పీకే కూడా ఒక‌రు. ఉత్త‌రాది రాష్ట్రం బిహార్ కు చెందిన ప్ర‌శాంత్ కిషోర్ 2014 లో మోడీని అధికారంలోకి తీసుకు రావ‌డంలో త‌న వంతుగా కీల‌క పాత్ర పోషించారు. ఆ త‌ర్వాత అనేక ఎన్నిక‌ల‌లో ఆయ‌న ప‌లు పార్టీల‌ను అధికారంలోకి తీసుకు రావ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందే పీకేను త‌న ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మించుకున్నారు. పీకే రెండేళ్ల ముందే ఏపీలో త‌న టీంతో దిగిపోయారు. సోష‌ల్ మీడియాను వాడుకుని టీడీపీకి ప‌లు సామాజిక వ‌ర్గాల‌ను దూరం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు.

ఇక టీడీపీ చిత్తు గా ఓడిపోయింది. ఇక ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌లు రెండేళ్ల‌కు పైగా ఉండ‌డంతో జ‌గ‌న్ మ‌రోసారి పీకేను రంగంలోకి దించుతున్నార‌న్న సంకేతాలు వైసీపీ వ‌ర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే చంద్ర‌బాబు సైతం త‌న పార్టీ కి ఓ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌ను నియ‌మించుకున్న సంగ‌తి తెలిసిందే. పీకే టీం సభ్యుడిగా ఉన్న రాబిన్ శ‌ర్మ‌ను వ‌చ్చే ఎన్నిక‌ల కోసం నియ‌మించుకున్నారు. ఆయ‌న ఏపీలో దిగ‌డంతో పాటు త‌మ టీం తో ప‌ని కూడా ప్రారంభించారు. పార్ల‌మెంట‌రీ పార్టీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఆయ‌న కో ఆర్డినేట‌ర్ల‌ను నియ‌మించుకున్నారు.

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ల‌లో రాబిన్ శ‌ర్మ వ్యూహ‌క‌ర్త‌గా కొంత వ‌ర‌కు ప‌ని చేశారు. అయితే ఆయ‌న వ‌ల్ల ఉప‌యోగం ఏ మాత్రం లేదు. లేటెస్ట్ అప్ డేట్ ప్ర‌కారం ఆయ‌న్ను బాబు ప‌క్క‌న పెట్టేయ‌డంతో పాటు పూర్తిగా త‌ప్పించేశార‌ని అంటున్నారు. రాబిన్ శ‌ర్మ  ఎత్తుగడలు, వ్యూహాలు తమకు పనికిరావని చంద్రబాబు డిసైడ్ అయ్యార‌ని పార్టీ నేత‌లు చెపుతున్నారు. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో పార్టీని స్ట్రాంగ్ చేయాలంటే ప్ర‌తి 50 మందికి ఓ కార్య‌క‌ర్త‌ను పెట్టుకుని.. ఆ స్ట్రాట‌జీతో ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని చూస్తున్నార‌ట‌.

సో ఇక‌పై బాబు సొంత వ్యూహాల‌తోనే ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. మ‌రి బాబు సొంత వ్యూహాలు వ‌చ్చే ఎన్నిక‌ల లో టీడీపీని ఎంత వ‌ర‌కు అధికారంలోకి తీసుకు వ‌స్తాయో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: