ఏపీలో డ్రగ్స్ దందా అంటూ వచ్చిన వార్త దేశం మొత్తం ఎపి వైపు చూసేలా చేసింది.నార్కోటిక్స్ డీఆర్ఐ,ఎన్ఐఏ లాంటి సంస్థలు ఇప్పటికే రంగంలోకి దిగి ఇప్పుడు పెద్ద ఎత్తున అసలు దందా వెనుక ఉన్న వాస్తవాలపై ఫోకస్ పెట్టింది,అయితే ఇదంతా ఒకెత్తు అయితే ఏపీలో డ్రగ్స్ రవాణా వార్తలు రాగానే రాజకీయంగా చేసిన చేస్తున్న ప్రకటనలు ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.రాష్ట్ర పోలీసులు,జాతీయ దర్యాప్తు సైతం ఏపీలో డ్రగ్స్ మూలాలు లేవని దాదాపు  అంచనాకు సైతం వచ్చేసాయి.అయితే ఇప్పుడే అస్సలు కధకు శ్రీకారం చుట్టాయి ఏపీలోని  కొన్ని పొలిటికల్  పార్టీలు.
ఆఫ్గాన్ నుంచి ఆంధ్రకు డ్రగ్స్ రవాణా అంటూ వార్తలు రాగానే జగన్ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నాయి విపక్షాలు.డ్రగ్స్ విషయంలో పొలిటికల్ పార్టీలు ప్రజా సంఘాలు వెర్షన్ ఎలా ఉన్న టీడీపీ మాత్రం జగన్ సర్కార్ పై డ్రగ్స్ రవాణా మరకను అంటించాలని తరువత ఇది నిజం చేశామని దర్యాప్తు సంస్థల కంటే ముందే తాము బయటపెట్టామని క్రెడిట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది టీడీపీ. ఒకప్పుడు పొలిటికల్ పార్టీగా హుందాగా అర్థవంతంగా ఆలోచ్చనాత్మకంగా ఉండే టీడీపీ కానీ పార్టీలోని ఇతర నేతలు ఇప్పుడు ఎందుకు రాను రాను ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారన్న చర్చ మేధావులు రాజకీయ వర్గాల్లో నడుస్తుంది.అంతర్జాతీయ స్థాయిలో దేశాలను రాష్ట్రాలలోకి డ్రగ్స్ ఎలా వస్తాయి ఒకవేళ వచ్చిన అంత పెద్దమొత్తంలో నిల్వలను ఎవరి కంట పడకుండా దాచి ఉంచడం సాధ్యం అవుతుందా,అస్సలు వాటిని రవాణా చేయడం అందులో రాష్ట్రాల మధ్య ఉన్న అన్ని పోర్టులను దాటుకొని ఎపిలోకి ఎలా తెస్తారన్న ఆలోచన కూడా లేకుండా రాజకీయాల కోసం ఒక రెస్పాన్సిబుల్ పోసిషన్ లో ఉండి అంత సిల్లీ స్టేట్మెంట్ లు ఎలా ఇస్తారన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి .అస్సలు బిజినెస్ పేరుతో డ్రగ్స్ రవాణా చేయడం సాధ్యం అవుతుందా.ఒకవేళ డ్రగ్స్ దందా చేస్తే దర్యాప్తు సంస్థలను దాటుకొని రాష్ట్రాలకు తరలిస్తుంటే ఎటువంటి చెకింగ్ లేకుండా అది సాధ్యం అవుతుందా.ఇంత పెద్ద ట్రాన్స్పోర్ట్ లావాదేవీలు చెయ్యాలి అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది
బిజినెస్ ప్రారంభం చేసే ముందు జీఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది ఒక బిల్డింగ్ రెంటల్ అగ్రిమెంట్ బేస్ చేసుకొని నేచర్ అఫ్ బిజినెస్ ఐడెంటిటీ ప్రూఫ్స్ సరిగా పెడితే ఎవరికైనా రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది.ఆ నేచర్ అఫ్ బిజినెస్ లో ఎవరూ కూడా నేను హెరాయిన్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తాను అని కానీ డ్రగ్స్,మాదక ద్రవ్యాలు పెడతాను అని కానీ పెట్టరు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అనే పేరుతో పెడతారు.. ఒన్స్ అప్రూవల్ వచ్చాక , బిజినెస్ స్టార్ట్ చేసాక ఏవైనా తేడా పనులు చేస్తే జీఎస్టీ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ప్రెమిసెస్ ని రైడ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం, టాక్స్ కట్టించండం లాంటివి చేస్తారు.అయితే ఏపీకి రవాణా జరుగుతుందని ప్రచారం చేస్తున్న విమర్శలు చేస్తున్న హెరాయిన్ స్టాక్ గుజరాత్ పోర్ట్ లో పట్టుకున్నారు. డీఆర్ఐ వాళ్ళు ఇప్పటికే ఏపీకి వచ్చి చెన్నై గుజరాత్లో కూడా విచార చేస్తున్నారు. అస్సలు అంత స్టాక్ ఒకేసారి లేదా చిన్న చిన్న లేదా లాట్ లో పంపాలన్నా,గూడ్స్ మూవ్మెంట్ ఎలా జరుగుతుంది అనేది కూడా ట్రాన్స్పోర్ట్ చేసేప్పుడు ఈవే బిల్ లో తెలుస్తుంది. పోర్ట్ లో ఉండే కస్టమ్స్, జీఎస్టీ,ఇన్కమ్ టాక్స్,డీఆర్ఐ లాంటి సంస్థలు కొన్ని డిపార్ట్మెంట్స్ కలిసి వర్క్ చేస్తేనే ఆ లింక్ బయటకి వస్తుంది,అస్సలు ఓవర్ వ్యూ చెయ్యాలన్న బయటకు రావాలన్నా కూడా ఎనలైజ్ చెయ్యాలన్నా చాలా టైం పడుతుంది.
అయితే ఇప్పుడు ఇంత తతంగం జరగాలి అంటే సాధ్యం అవుతుందా దీనిపై ఒక చిన్న ఉదాహరణ చూద్దాం మనకు లిక్కర్ షాప్ లో నల్ల డబ్బు ఎలా వస్తుంది. ప్రతి దానికి ఆ స్టోర్ వాడుబార్ కోడె ప్రకారం ఎపిబిసియల్ పోర్టల్ లో అప్డేట్ చేశాకే సరుకు ఇస్తున్నారు.. ఆ సేల్స్ డీటెయిల్స్ కి కాష్ డిపాజిట్ కి లెక్క చెప్పాల్సిందే కదా ? ఆ స్టోర్ వాడు కార్పొరేషన్ అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ చేస్తారు, కార్పొరేషన్ వాడు కంపెనీ లకి పేమెంట్ ఇస్తాడు.. ఈ డబ్బులు మొత్తం ఆఫ్ఘన్ పోవడం ఏంటి , ఆఫ్ఘన్ నుంచి హెరాయిన్ తెప్పించుకోవడం ఏంటి , ఎక్కడో గుజరాత్ లో డ్రగ్స్ పట్టుబడితే ఆంధ్రప్రదేశ్ మీద ఇంత కక్ష ఏంటి అసలు ఏమైనా లాజిక్ ఉందా ?? ఇన్ని డౌట్స్ లాజిక్ లేకుండా ఎలా మాట్లాడుతున్నారు.ఎలా విమర్శలు చేస్తున్నారు.
అస్సలు ఇదంతా పక్కన పెడితే సీఎం హోదాలో జగన్ డబ్బు సంపాదించుకోవాలి అని అనుకుంటే ఆ లక్ష కోట్లు పంచే బదులు ఎదో హడావుడి చేసి కాపిటల్ వర్క్స్ కాంట్రాక్టు లు ఇస్తే మినిమం 10 % వేసుకున్నా కాని దాదాపు పదివేల కోట్లు వచ్చేస్తాయి.లేదా సంక్షేమ కోసం ఖర్చు పెట్టె వాటిలో 10 శాతం అధికారుల వసూళ్లు చేయించిన ఈపాటికే రెండేళ్లలో 20 వేలకోట్లు వచ్చి పడతాయి కానీ ఎంతో రిస్క్ చేస్తే,వివాదాయాలు విమర్శలు కోరి తెచ్చుకొని ఆఫ్ట్రాల్ 9 వేలకోట్ల కోసం ఇంత బురద మీద వేసుకోవాల్సిన అవసరం ఉందా అని మేధావుల,తటస్థ వైఖరిని అవలంబించే గొంతుకలు మొత్తం విమర్శలు చేస్తున్న టీడీపీని,దానికి మద్దతుగా కధనాలు రాస్తున్న అనుబంధ మీడియాను ప్రశ్నిస్తున్నాయి.రాజకీయాల్లో ఎవరూ పతితులు కాదు.. కాని రాజకీయాలు చేసే ప్రాసెస్ లో పదవులు,పార్టీల ప్రభుత్వాల మధ్య వైరం కోసం స్టేట్ పరువు తీయకండని ఉచిత సలహాలను ఇస్తున్నాయి మేదావులు వర్గాలు

మరింత సమాచారం తెలుసుకోండి: